వీరిపై గుడ్డినమ్మకం పెట్టుకుంటే... చేజేతులారా మీకు మీరు హాని చేసుకున్నట్లే!

ABN , First Publish Date - 2022-09-28T12:08:02+05:30 IST

ఆచార్య చాణక్యుడు నాటి కాలపు గొప్ప దౌత్యవేత్త

వీరిపై గుడ్డినమ్మకం పెట్టుకుంటే... చేజేతులారా మీకు మీరు హాని చేసుకున్నట్లే!

ఆచార్య చాణక్యుడు నాటి కాలపు గొప్ప దౌత్యవేత్త, ఆర్థికవేత్త, తెలివైన వ్యక్తి. అతనిని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అని కూడా అంటారు. అతను జీవితంలో ఏది నేర్చుకున్నాడో, ఆ జ్ఞానాన్ని, అనుభవాన్ని చాణక్య నీతి ద్వారా మనకు అందించారు. ఆచార్య చాణక్యుడు తన విధానాలలో జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించారు. మనిషి తన జీవితంలోని ప్రతి మలుపులో తెలివిగా మసలుతూ ముందుకు సాగాలని, ఈ మార్గంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన జీవితంపై మంచి, చెడు ప్రభావాలను చూపిస్తారని ఆచార్య చాణక్య చెప్పారు. అందుకే ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించాలని, గుడ్డినమ్మకం హాని చేస్తుందని హెచ్చరించాడు. చాణక్య నీతి ప్రకారం ఎవరిమీద గుడ్డినమ్మకం పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆయుధాలు కలిగినవారు

ఆయుధాలను కలిగివున్న వ్యక్తులను గుడ్డిగా నమ్మడం వల్ల ప్రమాదాల బారిన పడతామని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తుల మాటలను తేలికగా తీసుకోవద్దు లేదా వారి ఉచ్చులో చిక్కుకోవద్దు. సాయుధులైన వీరు కోపంతో మిమ్మల్ని బాధించేందుకు అవకాశముంటుంది. అందుకే అటువంటివారికి దూరంగా ఉండటం ఉత్తమమని ఆచార్య చాణక్య సూచించారు. 


అధికారంలో ఉన్నవారు

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మీ కంటే చాలా రెట్లు శక్తివంతులుగా ఉన్నవారిని, అధికారంలో ఉన్నవారిని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ మాటల్లో ఏదైనా పొరపాటు వారికి కనిపిస్తే వారు తమ బలంతో మీకు సమస్యలను సృష్టించవచ్చు. అప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారు.

అత్యాశగలవారు

అత్యాశగలవారు వేరొకరికి ప్రయోజనం కలిగే పనిచేయరు. వారిలోని దురాశ ఇతరులకు ప్రమాదకరమని ఆచార్య చాణక్య తెలిపారు. చాణక్య నీతి ప్రకారం అత్యాశాపరులను నమ్మకూడదు. అలాంటివారు తమ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వారు మీ ప్రత్యర్థులతో చేయికలిపి మీకు హాని తలపెట్టే అవకాశం ఉంటుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

Read more