గుర్రంపై పెళ్లిమంటపానికి చేరుకున్న వరుడు.. రెండో అంతస్థులో వధువు.. కిటికీలోంచి చూసుకుని ఇద్దరి రియాక్షన్ను చూస్తే..
ABN , First Publish Date - 2022-01-03T00:21:05+05:30 IST
వివాహ కార్యక్రమంలో సాధారణంగా చాలా మంది పెళ్లికూతుళ్లు మౌనంగా ఉంటారు. అలాగే సిగ్గు, బిడియంగా ఉంటూ ఇబ్బంది పడుతుంటారు. కొందరు మాత్రం నవ్వుతూ సరదా సరదాగా ఉంటారు. ఇంకొందరు అమ్మాయిలైతే ఒకడుగు ముందుకేసి..
వివాహ కార్యక్రమంలో సాధారణంగా చాలా మంది పెళ్లికూతుళ్లు మౌనంగా ఉంటారు. అలాగే సిగ్గు, బిడియంగా ఉంటూ ఇబ్బంది పడుతుంటారు. కొందరు మాత్రం నవ్వుతూ సరదా సరదాగా ఉంటారు. ఇంకొందరు అమ్మాయిలైతే ఒకడుగు ముందుకేసి.. డ్యాన్సులు కూడా చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లిమండపానికి గుర్రంపై వచ్చిన వరుడు, రెండో అంతస్థు నుంచి వధువు.. ఒకరికొకరు చూసుకోవడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
‘witty_wedding’ అనే ఇన్స్టాగ్రాం అకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేశారు. పెళ్లి మండపంలో రెండో అంతస్థులో ఎరుపు రంగు లెహంగా ధరించిన వధువు.. వరుడి రాక కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈలోగా వరుడు గుర్రంపై ఠీవీగా అక్కడికి చేరుకుంది. అతన్ని చూడగానే వధువు ఒక్కసారిగా చిన్నపాటి స్టెప్పులు వేస్తూ... హాయ్ అంటూ పలకరిస్తుంది. వరుడు కూడా గుర్రంపై నుంచే హుషారుగా బదలిస్తాడు. ఈ సమయంలో బ్యాక్గ్రౌండ్లో చల్ ప్యార్ కరేగి అనే హిందీ పాట ప్లే అవుతుంది. వీడియోలో వీరి రియాక్షన్ చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.