న్యూడ్ వీడియో చూపించి మేనత్తను బెదిరిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు.. ఆమె తన సోదరితో కలిసి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-06-04T22:02:46+05:30 IST

ఆమె తన ఇంటి బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా ఆ కుర్రాడు వీడియో తీశాడు.. ఆ వీడియో చూపించి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు..

న్యూడ్ వీడియో చూపించి మేనత్తను బెదిరిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు.. ఆమె తన సోదరితో కలిసి ఏం చేసిందంటే..

ఆమె తన ఇంటి బాత్రూమ్‌లో స్నానం చేస్తుండగా ఆ కుర్రాడు వీడియో తీశాడు.. ఆ వీడియో చూపించి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే ఆ వీడియోను వైరల్ చేస్తానని హెచ్చరించాడు.. స్వంత మేనల్లుడు అలా చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది.. అతడిని చంపేందుకు పథకం వేసింది.. తన సోదరితో కలిసి ఆ కుర్రాడిని అతి దారుణంగా హత్య చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

హోటల్ ముందు కూర్చున్న బిచ్చగాళ్లపై దాష్టికం.. వారిని ఎంత దారుణంగా చంపాడంటే..


భోపాల్‌లోని సుఖీ సేవనియా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కుర్రాడు తన మేనత్త స్నానం చేస్తున్న సమయంలో రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఆ కుర్రాడు బెదిరించాడు. ఆ మహిళ తన బాధను సోదరికి చెప్పుకుంది. దీంతో ఇద్దరూ కలిసి ఆ కుర్రాడిని చంపేందుకు నిర్ణయించుకున్నారు. గత నెల 28వ తేదీన ఆ కుర్రాడిని ఓ దాబా వద్దకు రమ్మని ఆ మహిళ పిలిచింది. 


మేనత్త పిలిచిందనే సంతోషంతో ఆ కుర్రాడు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడకు వెళ్లాడు. అక్కడ ఆ మహిళ మళ్లీ తన వీడియోను డిలీట్ చేయాలని ప్రాథేయపడింది. అందుకు ఆ కుర్రాడు నిరాకరించాడు. దీంతో ఆ మహిళలిద్దరూ కలిసి ఓ పెద్ద రాయితో ఆ కుర్రాడి తల పగలగొట్టేశారు. ఆ కుర్రాడు అక్కడికక్కడే మరణించాడు. ఆ కుర్రాడి మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆ మహిళలిద్దరూ వెళ్లిపోయారు. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ కుర్రాడి ఫోన్ డేటా గమనించగా నిందిత మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ మహిళ నిజం చెప్పేసింది. దీంతో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-06-04T22:02:46+05:30 IST