పొదల్లో 62 ఏళ్ల వృద్ధుడి మృతదేహం.. పక్కింటి మహిళపై అనుమానం.. విచారణలో సంచలన విషయం వెల్లడి..

ABN , First Publish Date - 2022-04-14T20:11:08+05:30 IST

ఆ వ్యక్తి ప్రభుత్వోద్యోగం చేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు.. భార్య, కొడుక్కి దూరంగా వేరే ఇంట్లో ఉంటున్నాడు..

పొదల్లో 62 ఏళ్ల వృద్ధుడి మృతదేహం.. పక్కింటి మహిళపై అనుమానం.. విచారణలో సంచలన విషయం వెల్లడి..

ఆ వ్యక్తి ప్రభుత్వోద్యోగం చేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు.. భార్య, కొడుక్కి దూరంగా వేరే ఇంట్లో ఉంటున్నాడు.. తన పక్కింట్లో ఉండే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఆ మహిళ అతడిని డబ్బుల కోసం వేధించడం ప్రారంభించింది.. ఆ వృద్ధుడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు.. దీంతో ఆ మహిళ తన సోదరి, మరిది సహాయంతో ఆ వృద్ధుడిని చంపేసింది.. మృతదేహాన్ని ఊరికి దూరంగా పొదల్లో పారేసింది.. చివరకు పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలైంది. 


రాజస్థాన్‌లోని బాన్స్‌వారాకు సమీపంలోని బిజోరా గ్రామానికి చెందిన మోహన్ లాల్ అనే వ్యక్తి తన పక్కింట్లో ఉండే షమీమ్ భాను అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్య, కొడుకుని దూరంగా ఉంచి షమీమ్‌ను తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె మోహన్ లాల్ ఆస్తి మీద కన్నేసింది. వీలైనప్పుడల్లా మోహన్ లాల్ నుంచి డబ్బులు తీసుకునేది. ఇటీవల తనకు రెండు లక్షలు కావాలని అడిగింది. అంత డబ్బు ఇచ్చేందుకు మోహన్ లాల్ నిరాకరించాడు. దాంతో తన సోదరి సైరా, ఆమె భర్త జగదీష్‌తో కలిసి మోహన్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. అయినా మోహన్ లాల్ డబ్బులు ఇవ్వలేదు. 


మంగళవారం రాత్రి ముగ్గురూ కలిసి మోహన్‌ను తీవ్రంగా కొట్టారు. అనంతరం గొంతు నులిమి చంపేశారు. తమపై అనుమానం రాకుండా ఊరికి దూరంగా పొదల్లో అతడి మృతదేహాన్ని పారేశారు. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. గ్రామస్తులు షమీమ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. షమీమ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆమె నేరం అంగీకరించింది. దీంతో ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-04-14T20:11:08+05:30 IST