నా భర్తకు లోపం ఉంది.. నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు!

ABN , First Publish Date - 2022-05-30T15:52:33+05:30 IST

ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. రూ.8 లక్షల కట్నం ఇచ్చి మరీ తండ్రి ఆమెకు పెళ్లి చేశాడు..

నా భర్తకు లోపం ఉంది.. నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు!

ఆమెకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.. రూ.8 లక్షల కట్నం ఇచ్చి మరీ తండ్రి ఆమెకు పెళ్లి చేశాడు.. అయితే ఆమెను భర్త తన దగ్గరకు కూడా రానివ్వలేదు.. సిగ్గుపడుతున్నాడేమో అనుకుంది.. ఎంతకాలం అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.. ముగ్గురు డాక్టర్లకు చూపించినా ఫలితం కనిపించలేదు.. పైగా అతను రివర్స్‌లో ఆమెను కట్నం గురించి వేధించడం ప్రారంభించాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 


ఇది కూడా చదవండి..

పెళ్లి రోజును మ‌ర్చిపోయిన భ‌ర్త‌.. భార్య చేసిన ప‌నికి షాక్.. చివ‌ర‌కు అస‌లు విష‌యం తెలిసి..!


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళకు 2020 జనవరిలో రోహిత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్తకు దగ్గరయ్యేందుకు ఆమె ప్రయత్నిస్తుండగా, అతను మాత్రం ఆమెను దూరం పెడుతున్నాడు. చాలా ఒత్తిడిగా ఉందని, ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో ఆమె అర్థం చేసుకుంది. ఎంతకాలం అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆమెలో అనుమానం మొదలైంది. అప్పుడు అసలు విషయం బయటపడింది. పెళ్లికి ముందు నుంచే అతనిలో సమస్య ఉందని తెలిసింది. ముగ్గురు డాక్టర్లకు చూపించినా ఫలితం రాలేదు. 


రోహిత్ తల్లిదండ్రులకు కూడా ఆ సమస్య గురించి తెలుసు. అయినా వారు ఆ విషయం దాచి భారీ కట్నం తీసుకుని పెళ్లి జరిపించారు. భార్య తనను వేలెత్తి చూపించే లోపు రోహిత్ ఆమెపై దాడికి దిగాడు. అదనపు కట్నం గురించి వేధించడం మొదలుపెట్టాడు. రోహిత్ తల్లిదండ్రులు కూడా ఆమెపై వరకట్న వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-05-30T15:52:33+05:30 IST