అబార్షన్ చేసుకుందని.. భార్యకు విడాకులు ఇచ్చిన భర్త.. నిజానికి అతడు అలా ఎందుకు చేశాడంటే..
ABN , First Publish Date - 2022-01-27T06:38:39+05:30 IST
ఓ ముస్లిం యువతికి వివాహం జరిగినప్పటి నుంచి తన భర్తతో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఆమె గర్భవతి అని చూడకుండా ఆమెను కొట్టాడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది. ఆ తరువాత అతను ఆమెకు విడాకులు ఇచ్చాడు...

ఓ ముస్లిం యువతికి వివాహం జరిగినప్పటి నుంచి తన భర్తతో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో ఆమె గర్భవతి అని చూడకుండా ఆమెను కొట్టాడు. దీంతో ఆమెకు గర్భస్రావం అయింది. ఆ తరువాత అతను ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన సమీరా(23) అనే ముస్లిం యువతికి 2020 డిసెంబర్లో హైదర్ అనే యువకునితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్దికాలానికే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. హైదర్ తరుచూ సమీరాను కొట్టేవాడు. అమెను పరుష పదజాలంతో తిట్టేవాడు. అతనికి మరో యువతితో అక్రమ సంబంధం ఉందని సమీరాను అనుమానం కలిగింది. ఈ క్రమంలో సమీరా ఒకసారి గర్భవతి అయినప్పుడు మళ్లీ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో హైదర్ ఆమెను కింద పడేసి కడుపులో తన్నాడు. దీంతో సమీరా రక్తస్తావమై ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె అబార్షన్ చేయాల్సి వచ్చింది. ఇదే కారణం చూపించి హైదర్ సమీరాకు మూడు సార్లు తలాక్ అని చెప్పేసి వెళ్లిపోయాడు. ఇస్లాం మతం ప్రకారం భర్త మూడు సార్లు తలాక్ అని భార్య మందు చెబితే వారిద్దరి మధ్య వివాహ బంధం రద్దైనట్లే. వారిద్దరూ ఇక అధికారికంగా విడాకులు పొందవచ్చు.
ఆ తరువాత సమీరా తన భర్త హైదర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కొట్టడం వల్లే తనకు గర్భస్రావమైందని.. కానీ భర్త మాత్రం తాను అబార్షన్ చేయించుకున్నానని కారణం చూపి తలాక్ చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు హైదర్‌ను అరెస్టు చేసి విచారణ చేయగా.. అతడు మరో యువతి మోజులో పడి భార్యకు విడాకులిచ్చాడని తేలింది.
ప్రస్తుతం పోలీసులు హైదర్‌పై గృహహింస కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.