ముఖ్యమంత్రి డాన్స్ వీడియో viral
ABN , First Publish Date - 2022-06-24T14:12:31+05:30 IST
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనుల వేషధారణతో నృత్యం (DANCE) చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా...

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనుల వేషధారణతో నృత్యం (DANCE) చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఎంపికైనందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం (CM)శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనులు, బీజేపీ నేతలతో కలిసి డాన్స్ చేసి సందడి చేశారు.సీఎం శివరాజ్ సింగ్ గిరిజనుల దుస్తులు ధరించి, చేతుల్లో నెమలి ఈకలు, విల్లు చేతబట్టి గిరిజన మహిళలతో కలిసి పాటకు డాన్స్ చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక చేయడం పట్ల చాలా సంతోషిస్తున్నట్లు సీఎం చౌహాన్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడానికి ముందు న్యూఢిల్లీకి వచ్చారు.