పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలి.. ప్రియుడితో వెళ్లిన తల్లి.. తండ్రి కూడా ఎంతకీ రాకపోవడంతో.. పాపం చివరకు చిన్నారుల పరిస్థితి..

ABN , First Publish Date - 2022-07-02T22:26:01+05:30 IST

భర్త, పిల్లలే తన ప్రపంచంగా బతుకుతుంది మహిళ. జీవితం మొత్తం వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుంది. పిల్లలను విడిచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేరు. అలాంటి మహిళలు..

పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలి.. ప్రియుడితో వెళ్లిన తల్లి.. తండ్రి కూడా ఎంతకీ రాకపోవడంతో.. పాపం చివరకు చిన్నారుల పరిస్థితి..

భర్త, పిల్లలే తన ప్రపంచంగా బతుకుతుంది మహిళ. జీవితం మొత్తం వారి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుంది. పిల్లలను విడిచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేరు. అలాంటి మహిళలు ఉన్న ఈ సమాజంలో.. పిల్లల సంక్షేమాన్ని గాలికొదిలి, భర్తకు తెలీకుండా వివాహేతర సంబంధాలను కొనసాగించే మహిళలూ ఉన్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఇద్దరు పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలిన తల్లి.. ప్రియుడితో సహా వెళ్లిపోయింది. వస్తాడునుకున్న నాన్న కూడా పట్టించుకోలేదు. ఆ పిల్లల పరిస్థితిని చూసి స్థానికులంతా అయ్యో.. పాపం.. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.


మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ రైల్వే ఉద్యోగికి భార్య, ఐదేళ్ల కొడుకు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. వీరికి ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేకపోవడంతో సంతోషంగా జీవించేవారు. అయితే భార్య తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఆ కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. భర్తకు తెలీకుండా వేరే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ప్రియుడి ధ్యాసలో పడి పిల్లల సంక్షేమాన్ని కూడా గాలికొదిలేసింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో నాలుగు నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఉంటోంది. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ‘‘ఇక్కడే ఉండండి.. మీ నాన్న వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు’’.. అని పిల్లలకు చెప్పింది.

ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..


అనంతరం అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. తల్లి మాట నమ్మిన చిన్నారులు.. తండ్రి వస్తాడని చాలా సేపు అక్కడే ఉన్నారు. కానీ తండ్రి కూడా వారిని పట్టించుకోలేదు. ఎవరూ రాకపోవడంతో ఇద్దరూ ఏడుస్తూ ఉన్నారు. స్థానికులు గమనించి విచారించారు. సమాచారం అందుకున్న మాతృ ఛాయా అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అక్కడికి చేరుకుని, పిల్లలను దత్తత తీసుకున్నారు. తల్లి, తండ్రి ఉన్నా అనాథలైన ఆ పిల్లలను చూసి.. స్థానికులంతా అయ్యో! పాపం.. అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

దుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు..

Read more