ముగ్గురు పిల్లలను తీసుకుని చెరువు వద్దకు వెళ్లిన మహిళ.. అక్కడ ఆమె చేస్తున్న పని చూసి షాకైన గ్రామస్థులు..

ABN , First Publish Date - 2022-02-22T22:56:58+05:30 IST

ఆమెకు ముగ్గురు పిల్లలు.. భర్త వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండడంతో అత్తగారితో కలిసి స్వగ్రామంలో ఉంటోంది..

ముగ్గురు పిల్లలను తీసుకుని చెరువు వద్దకు వెళ్లిన మహిళ.. అక్కడ ఆమె చేస్తున్న పని చూసి షాకైన గ్రామస్థులు..

ఆమెకు ముగ్గురు పిల్లలు.. భర్త వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండడంతో అత్తగారితో కలిసి స్వగ్రామంలో ఉంటోంది.. సోమవారం ఉదయం తన ముగ్గురు పిల్లలను తీసుకుని గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లింది.. పిల్లలకు స్నానం చేయించడానికి వచ్చిందని చుట్టుపక్కల వారు అనుకున్నారు.. అయితే ఆమె అందరికీ షాకిచ్చింది.. ముందు ఓ చిన్నారిని చెరువులోకి విసిరేసింది.. తర్వాత మరో ఇద్దరిని పట్టుకుని చెరువులోకి దూకేసింది.. బీహార్‌లోని గయకు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


గయకు సమీపంలోని దోమియా గ్రామానికి చెందిన రేఖా దేవికి ముగ్గురు పిల్లలు. భర్త వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండడంతో అత్తగారితో కలిసి స్వగ్రామంలో ఉంటోంది. అయితే అత్తగారితో రేఖకు తరచుగా గొడవలు జరుగుతుండేవి. ప్రతి చిన్న విషయానికీ వారిద్దరూ గొడవ పడుతూ ఉండేవారు. భర్తకు చెప్పినా అతను తల్లికే మద్దతు పలికేవాడు. దీంతో విసిగిపోయిన రేఖ ఆత్మహత్య నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం తన ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకేసింది. 


పక్కనే ఉన్న గ్రామస్థులు వెంటనే చెరువులోకి దూకి రేఖను వెలికి తీశారు. అయితే ఎంత వెతికినా ముగ్గురు పిల్లల ఆచూకీ దొరకలేదు. రేఖను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉంది. కాగా, చెరువులోని పిల్లల కోసం గజ ఈతగాళ్లు అన్వేషణ సాగిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 

Updated Date - 2022-02-22T22:56:58+05:30 IST