పెళ్లి విందుకు లెక్కకుమించి వచ్చిన జనం... వారిని అదుపు చేసేందుకు ఆడపెళ్లివారు పెట్టిన కండీషన్ ఏమిటంటే...

ABN , First Publish Date - 2022-09-27T14:04:06+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒక విచిత్ర ఉదంతం...

పెళ్లి విందుకు లెక్కకుమించి వచ్చిన జనం... వారిని అదుపు చేసేందుకు ఆడపెళ్లివారు పెట్టిన కండీషన్ ఏమిటంటే...

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడ జరిగిన ఒక వివాహానికి అతిథులు లెక్కకుమించి హాజరయ్యారు. దీంతో విందు విషయంలో సమస్య తలెత్తింది. అప్పుడు ఆడపెళ్లివారు ఏమి చేశారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈరోజుల్లో పెళ్లిళ్లకు లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొన్నిసార్లు అతిథులు అధిక సంఖ్యలో హాజరవుతుండటంతో అందరికీ విందు అందని పరిస్థితి ఏర్పడుతోంది. 


ఇటువంటి పరిస్థితే అమ్రోహాలో ఒక పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలోని కంటెంట్ ప్రకారం పెళ్లిలో ఏర్పాటు చేసిన విందుకు అధిక సంఖ్యలో అతిథులు రావడంతో పెళ్లికుమార్తె తరపువారు కల్యాణమండపం తలుపులు మూసివేసి, ఆధార్ కార్డు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించారు. అక్కడి గేట్ కీపర్ ఆధార్ కార్డు ఉన్నవారిని గుర్తించి, వారిని మాత్రమే హాల్లోకి అనుమతించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆధార్ కార్డు లేని అతిథులు అక్కడి నుంచి వెనుదిరగడం కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. 

Read more