Viral Video: పెద్దపులితో కోతి మైండ్ గేమ్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ABN , First Publish Date - 2022-10-02T21:07:03+05:30 IST

అడవిలో సింహం, పెద్దపులి వంటి క్రూర జంతువులు తమ ఆహారం కోసం సాధు జంతువులను వేటాడుతాయి. వేట కొన్నిసార్లు చాలా సులభంగా జరుగుతుంది.

Viral Video: పెద్దపులితో కోతి మైండ్ గేమ్.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

అడవిలో సింహం, పెద్దపులి వంటి క్రూర జంతువులు తమ ఆహారం కోసం సాధు జంతువులను వేటాడుతాయి. వేట కొన్నిసార్లు చాలా సులభంగా జరుగుతుంది. మరికొన్ని సార్లు క్రూర జంతువులకే, ఇతర జంతువులు చుక్కలు చూపెడతాయి. జంతువుల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఓ పాత వీడియో వీడియో మళ్లీ వైరల్ (viral video) అవుతోంది.


ఆ వీడియోలో.. చెట్టు మీద ఉన్న కోతిని పట్టుకునేందుకు పెద్ద పులి కూడా చెట్టు ఎక్కింది. దీంతో కోతి చిటారు కొమ్మ వరకు వెళ్లిపోయింది. కోతి కోసం పెద్ద పులి కూడా అక్కడి వరకు వెళ్లిపోయింది. చిటారు కొమ్మ మీద నుంచి కోతి మరొక కొమ్మ మీదకు దూకేయగా.. పెద్ద పులి మాత్రం జారి కింద పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  

Updated Date - 2022-10-02T21:07:03+05:30 IST