Mohanbabu: మెగాస్టార్‌కు.. శుభాకాంక్షలు!

ABN , First Publish Date - 2022-11-22T17:36:35+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవికి మంచు మోహన్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌ 2022’ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్‌కు ఆయన ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.

Mohanbabu: మెగాస్టార్‌కు.. శుభాకాంక్షలు!

మెగాస్టార్‌ చిరంజీవికి (Chiranjeevi)మంచు మోహన్‌బాబు (Mohanbabu) శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌ 2022’ (IFFI)పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్‌కు ఆయన ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ‘‘మై డియర్‌ చిరంజీవి గోవాలో జరుగుతున్న ఇఫి వేడుకలో ప్రతిష్ఠాత్మక పురస్కారం (Indian Film Personality Of The Year) అందుకోబోతున్నందుకు అభినందనలు. షిర్డి సాయిబాబా ఆశీస్సులతో మీరు మరెన్నో పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. మంచు విష్ణు కూడా చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఈ నె 29 వరకూ గోవాలో జరగనున్న ‘ఇఫి’ వేడుకలో చిరంజీవి ఈ పురస్కారం అందుకోబోతున్నారు.


Updated Date - 2022-11-22T18:11:20+05:30 IST