నాలుగేళ్లుగా వీడని మిస్టరీ.. ఇంతకీ ఈ 24 ఏళ్ల యువతి ఏమైపోయింది..? అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-05T21:40:13+05:30 IST

కొన్నిసార్లు ఎంత పెద్ద కేసులనైనా పోలీసులు.. చిన్న క్లూతో ఛేదిస్తుంటారు. అయితే ఇంకొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న కేసులు కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఏళ్లు గడుస్తున్నా కేసులు...

నాలుగేళ్లుగా వీడని మిస్టరీ.. ఇంతకీ ఈ 24 ఏళ్ల యువతి ఏమైపోయింది..? అసలేం జరిగిందంటే..

కొన్నిసార్లు ఎంత పెద్ద కేసులనైనా పోలీసులు.. చిన్న క్లూతో ఛేదిస్తుంటారు. అయితే ఇంకొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న కేసులు కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఏళ్లు గడుస్తున్నా కేసులు మాత్రం కొలిక్కిరావు. కేరళ పోలీసులు ఓ కేసులో ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. డిగ్రీ చదువుతున్న ఓ యువతి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. నాలుగేళ్లవుతున్నా ఆమె ఆచూకీని మాత్రం కనుగొనలేకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


కేరళ రాష్ట్రం పాతనంతిట్టలోని ఎరుమేలి పట్టణానికి చెందిన జెస్నా అనే యువతి అదృశ్యమై ఈ ఏడాది మార్చి 22నాటికి సరిగ్గా నాలుగేళ్లు అయింది. 2018లో ఈమె కొట్టాయంలోని ని కంజిరపల్లిలోని సెయింట్ డొమినిక్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదివేది. ఈ యువతి మేనత్త.. కొట్టాయంలోని ముండకాయంలో నివాసం ఉంటోంది. అయితే అదే ఏడాది మార్చి 22న తన అత్తను చూసేందుకు యువతి బస్సులో వెళ్లింది. అయితే యువతి అటు నుంచి అటే ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

కొత్త కోడలు చెప్పిందని రోజూ రాత్రి పాలు తాగుతున్న కుటుంబ సభ్యులు.. మూడో రోజు పొద్దున్నే లేచి చూస్తే..


జెస్నా వెళ్లే సమయంలో స్నేహితులకు మెసేజ్ చేసినట్లు గుర్తించారు. అయితే తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. త్వరలో ఆమె ఆచూకీ కనుక్కుంటామని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. అయితే నెలలు గడుస్తున్నా ఫలితం కానరాకపోవడంతో.. చివరికి గత ఏడాది కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అయినా ఇప్పటికీ సీబీఐ కూడా ఆమె ఆచూకీని కనుగొనలేకపోయింది. ఆమె దేశం విడిచి వెళ్లిందనే అనుమానాలు ఉండడంతో ఎల్లో నోటీసులు జారీ చేశారు. ఆమె అపహరణకు గురై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..

Updated Date - 2022-04-05T21:40:13+05:30 IST