మా అబ్బాయిని వదిలేసి పొమ్మంటూ అత్తమామల బెదిరింపులు.. వెళ్లనని తేల్చిచెప్పిన కొత్త కోడలు.. చివరకు..

ABN , First Publish Date - 2022-03-21T20:36:10+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు.. అయితే అది కులాంతర వివాహం కావడంతో అబ్బాయి తరఫు వారు ఆగ్రహంగా ఉన్నారు..

మా అబ్బాయిని వదిలేసి పొమ్మంటూ అత్తమామల బెదిరింపులు.. వెళ్లనని తేల్చిచెప్పిన కొత్త కోడలు.. చివరకు..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు.. అయితే అది కులాంతర వివాహం కావడంతో అబ్బాయి తరఫు వారు ఆగ్రహంగా ఉన్నారు.. తమ కొడుకుని వదిలేసి పొమ్మని యువతిని బెదిరించారు.. ఎక్కడికీ వెళ్లనని ఆమె తేల్చి చెప్పడంతో అత్తింటి వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.. శనివారం రాత్రి ఆమెను చితక్కొట్టి గొంతు కోసి చంపేశారు.. మృతదేహాన్ని మాయం చేసేందుకు వాహనంలో వేసుకుని బయల్దేరారు.. మార్గమధ్యంలో పోలీసులకు దొరికిపోయారు. 


బీహార్‌లోని బంకాకు చెందిన రాజేష్ అనే యువకుడు ఏడాది క్రితం కృష్ణ కుమారి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అది కులాంతర వివాహం కావడంతో రాజేష్ తల్లిదండ్రులు కృష్ణ కుమారిని అంగీకరించలేదు. తమ కొడుకుని వదిలేసి వెళ్లిపొమ్మని ఆమెను బెదిరించారు. అయితే ఆ బెదిరింపులకు కృష్ణ కుమారి భయపడలేదు. ఎక్కడికీ వెళ్లేది లేదని ఆమె తేల్చి చెప్పింది. దీంతో రాజేష్ కుటుంబ సభ్యులు శనివారం రాత్రి ఆమెను చితక్కొట్టారు. గొంతు కోసి చంపేశారు. రాజేష్ కూడా ఈ హత్యలో పాలు పంచుకున్నాడు.


మృతదేహాన్ని స్మశానంలో పూడ్చి పెట్టేందుకు బొలేరో వాహనంలో అందరూ బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు దొరికిపోయారు. వాహనంలో ఉన్న అందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. తాము హత్యలో పాలు పంచుకున్నట్టు రాజేష్, అతని తల్లిదండ్రులు, సోదరి, బావమరిది పోలీసుల ఎదుట అంగీకరించారు. వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-03-21T20:36:10+05:30 IST