పెళ్లయిన 6 సంవత్సరాల తర్వాత మరో యువకుడితో ప్రేమాయణం.. భర్త ఇచ్చిన బహుమతి అంటూ ఆ మహిళ చేసిన పని ఏంటో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-03-08T20:33:59+05:30 IST
ఆ మహిళకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది.. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు..

ఆ మహిళకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది.. ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.. ఇటీవల ఆమె భర్తను, పెద్ద కూతురిని వదిలేసి ఓ యువకుడితో వెళ్లిపోయింది.. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను, ఆమె ప్రియుడిని పట్టుకున్నారు.. పోలీస్ స్టేషన్లో ఆమె చెప్పిన సమాధానం విని ఆమె భర్త మాత్రమే కాదు.. పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన బర్ఖాకు ఆరేళ్ల క్రితం ఆకాష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. మెకానిక్‌గా పనిచేసే ఆకాష్ కట్నం కోసం తన భార్యను వేధించేవాడు. రోజూ తాగి వచ్చి ఆమెను హింసించేవాడు. ఏడాది కిత్రం ఆమెకు భర్త స్నేహితుడు సమీర్‌తో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య స్నేహం పెరిగి అది ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా నిత్యం టచ్‌లో ఉండేవారు. వారం రోజుల క్రితం బర్ఖా తన చిన్న కూతురిని తీసుకుని సమీర్‌తో కలిసి ఉజ్జయినికి వెళ్లిపోయింది. దీంతో ఆకాష్ తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా బర్ఖా, సమీర్‌లను పోలీసులు ట్రేస్ చేశారు. ఉజ్జయినిలో వారిద్దరినీ పట్టుకుని సోమవారం ఉదయం లక్నోలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ బర్ఖా చెప్పిన మాటలు విని అందరూ షాకయ్యారు. ఆరేళ్ల వైవాహిక జీవితంలో భర్త తనను ఎన్నో ఇబ్బందులు పెట్టాడని, శారీరకంగా, మానసికంగా హింసించాడని, అందుకే సమీర్‌ను వివాహం చేసుకున్నానని తెలిపింది. తన భర్త తన స్నేహితుడిని తనకు బహుమతిగా ఇచ్చాడని బర్ఖా పోలీసుల ఎదుట చెప్పింది. షాకైన పోలీసులు వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.