-
-
Home » Prathyekam » Marriage Card in Tablet Sheet Format Viral in social media prvn spl-MRGS-Prathyekam
-
Viral News: యువకుడి క్రియేటివ్ ఐడియాకు నెటిజన్లు షాక్.. అతడి పెళ్లి పత్రిక చూసి.. ఫార్మసీ లెక్చరర్ అయితే మాత్రం మరీ ఇలానా అంటూ..
ABN , First Publish Date - 2022-08-20T14:49:46+05:30 IST
స్తుతం నెట్టింట ఓ యువకుడికి సంబంధించిన పెళ్లి పత్రిక వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ‘నీ క్రియేటివ్ ఐడియాకు దండం బాబు’ అని కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో ‘ఎంత ఫార్మసీ టీచర్‌వి అయితే

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం నెట్టింట ఓ యువకుడికి సంబంధించిన పెళ్లి పత్రిక వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతేకాకుండా ‘నీ క్రియేటివ్ ఐడియాకు దండం బాబు’ అని కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరేమో ‘ఎంత ఫార్మసీ టీచర్‌వి అయితే మాత్రం వెడ్డింగ్ కార్డును మరీ ఇలా డిజైన్ చేయాలా’ అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఇంతకూ ఆ యువకుడు ఎవరు? ఏం చేశాడు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
వివాహాం.. ప్రతి ఒక్కరి జీవితంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లి వేడుకతోనే అందరూ సరికొత్త జీవితాన్ని మొదలు పెడతారు. అందుకే ఈ వేడుకను అంగరంగ వైభవంగా.. జరుపుకొంటూ, మధుర జ్జాపకంగా మలుచుకుంటారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఎళిలరసన్(Ezhilarasan) అనే ఫార్మసీ లెక్చరర్(pharmacy teacher from Tamil Nadu).. వినూత్నంగా ఆలోచించాడు. ఎవ్వరి ఊహకు అందని విధంగా వెరైటీగా శుభలేఖను ముద్రింపజేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎళిలరసన్‌కు వసంతకుమారి అనే యువతితో వచ్చే నెల 5వ తేదీన పెళ్లి(Marriage) నిశ్చయం అయింది. ఈ క్రమంలో అతడి పెళ్లి తేదిన ఎవ్వరూ మర్చిపోకుండా ఉండేందుకని ట్యాబ్లెట్ షీట్ ఫార్మెట్‌లో వెడ్డింగ్ కార్డులను(Marriage Card in Tablet Sheet Format) తయారు చేయించాడు. వాటిని స్నేహితులు, సన్నిహితులకు పంపిణీ చేస్తూ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాడు. దీంతో కొందరు ఆ వెడ్డింగ్ కార్డును ఫొటో తీసి, సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్(Viral)గా మారింది.
