బాలిక అపస్మారక స్థితిలో ఉంది.. త్వరగా వచ్చేయండి.. అంటూ స్నేహితులకు ఫోన్.. చివరకు ఇంటికి చేరుకున్న బాలిక ఇలా చెప్పడంతో..

ABN , First Publish Date - 2022-03-16T22:13:12+05:30 IST

తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఒంటరిగా బయటికి పంపాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా పొలానికి వెళ్లిన బాలికను...

బాలిక అపస్మారక స్థితిలో ఉంది.. త్వరగా వచ్చేయండి.. అంటూ స్నేహితులకు ఫోన్.. చివరకు ఇంటికి చేరుకున్న బాలిక ఇలా చెప్పడంతో..
ప్రతీకాత్మక చిత్రం

అమ్మాయిలు ఒంటిరిగా కనిపిస్తే చాలు.. వక్ర బుద్ధిని చూపించే రోజులివి. పరాయి ఆడపిల్లలో తల్లిని, చెల్లిని చూసుకోవాల్సింది పోయి.. తమలోని శాడిజాన్ని చూపిస్తున్నారు. అత్యాచారాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజూ ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. క్షణకాల సుఖం కోసం.. మహిళల జీవితాలనే నాశనం చేస్తున్నారు. దీంతో ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు తమ కుమార్తెలను ఒంటరిగా బయటికి పంపాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా పొలానికి వెళ్లిన బాలికను టార్గెట్ చేసిన ఓ యువకుడు.. చివరికి తన స్నేహితులను కూడా పిలిచి దారుణానికి ఒడిగట్టాడు. మార్చి 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు వారి కుమార్తె ఒంటరిగా పొలం వద్దకు వెళ్లింది. అదే సమయంలో ఓ యువకుడు అటుగా వెళ్తూ ఆమెను గమనించాడు. ఒంటరిగా ఉందని గుర్తించి.. బాలికను అనుసరిస్తూ పొలం వరకూ వెళ్లాడు. ఆమెకు ఏవేవో అబద్ధాలు చెప్పి తాను మంచి వ్యక్తిగా నమ్మించాడు. దీంతో బాలికకు ఎలాంటి అనుమానం కలగలేదు. తర్వాత ఆమెపై ఒక్కసారిగా బలత్కారం చేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఆమె భయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తర్వాత తన స్నేహితులకు ఫోన్ చేసి.. ‘‘ ఓ బాలిక అపస్మారక స్థితిలో ఉంది.. త్వరగా వచ్చేయండి’’.. అని మరో ముగ్గురిని పిలిపించాడు.

‘‘ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నా’’... అంటూ బాలికను నమ్మించి తీసుకెళ్లాడు.. చివరకు వైద్య పరీక్షల్లో తేలింది ఏంటంటే..


అంతా కలిసి బాలికను ఓ గదిలోకి తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను పట్టణానికి సమీపంలోని ఓ మార్కెట్ వద్ద వదిలి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఏడుస్తూ ఇంటికి వెళ్లిన బాలిక.. జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ధర్నా చేశారు. చివరకు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పీఈటీ చేసిన నిర్వాకాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది.. ఇటీవల చెల్లెలికి కూడా అలాగే జరగడంతో.. చివరికి..

Updated Date - 2022-03-16T22:13:12+05:30 IST