Viral News: వామ్మో.. కాటేసిన పామును హాస్పిటల్‌కు తీసుకెళ్లిన వ్యక్తి.. పరుగులు తీసిన జనం..!

ABN , First Publish Date - 2022-07-30T00:15:36+05:30 IST

ఈ ప్రపంచంలో చాలా మందికి పాములంటేనే ఎక్కువ భయం. పాము ఉందని తెలిస్తే చాలు..

Viral News: వామ్మో.. కాటేసిన పామును హాస్పిటల్‌కు తీసుకెళ్లిన వ్యక్తి.. పరుగులు తీసిన జనం..!

ఈ ప్రపంచంలో చాలా మందికి పాములంటేనే ఎక్కువ భయం. పాము ఉందని తెలిస్తే చాలు.. అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. తాజాగా బీహార్‌కు చెందిన ఓ వ్యక్తిని పాము కాటు వేసింది. అయితే అతను ఏమాత్రం టెన్షన్ పడకుండా కాటు వేసిన పాముని వెతికి మరీ పట్టుకున్నాడు. దానిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యులకు చూపించాడు. ఆ పాము విషానికి విరుగుడు ఇవ్వాలని అడిగాడు. అతడు చేసిన పనికి వైద్యులకు చుక్కలు కనిపించాయి. 


ఇది కూడా చదవండి..

ED Raids: ఈడీ దాడుల్లో దొరికిన వేల కోట్లను ఏం చేస్తారు..? బంగారం, డబ్బును ఎక్కడ దాస్తారు..?


బీహార్‌ (Bihar)లోని షరీఫ్ జిల్లాలో కొరై గ్రామానికి చెందిన సురేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మంగళవారం పొలం పనులకు వెళ్లాడు. ఆ సమయంలో అతడిని ఒక పాము కాటు (Snake bite) వేసింది. పాము కాటు వేసినా సురేంద్ర ఏమాత్రం టెన్షన్ పడలేదు. కాటు వేసిన పాము కోసం అన్వేషించి పట్టుకున్నాడు. ఓ డబ్బాలో వేసి దానిని తీసుకుని బుధవారం ఉదయం హాస్పిటల్‌కు వెళ్లి పాము కాటు గురించి చెప్పాడు. హాస్పిటల్‌లో వైద్యులు ఏ పాము కరిచిందని అడగ్గానే.. పామును డబ్బాలో నుంచి బైటకు తీశాడు. 


పామును చూసిన వైద్యులు తలోదిక్కుకు పరుగులు పెట్టారు. ఆ తర్వాత తేరుకుని పాము కాటుకు సరైన విరుగుడు మందును ఇచ్చారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ (viral news)గా మారింది. 

Updated Date - 2022-07-30T00:15:36+05:30 IST