-
-
Home » Prathyekam » Man married wifes sister when the victin protested sgr spl-MRGS-Prathyekam
-
అక్క ఇంటికి వెళ్తూ బావ మనసు దోచుకుంది.. చివరకు వారిద్దరూ కలిసి ఎంత పని చేశారంటే..
ABN , First Publish Date - 2022-03-05T22:11:47+05:30 IST
అతనికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఒక కొడుకు కూడా ఉన్నాడు.. అత్తమామాలు, భార్య సోదరి తరచుగా అతని ఇంటికి వచ్చి వెళ్లేవారు..

అతనికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఒక కొడుకు కూడా ఉన్నాడు.. అత్తమామాలు, భార్య సోదరి తరచుగా అతని ఇంటికి వచ్చి వెళ్లేవారు.. ఈ క్రమంలో భార్య సోదరిపై అతను మనసు పారేసుకున్నాడు.. ఆమె కూడా అక్క భర్తతో ప్రేమలో పడింది.. ఇద్దరూ ఎవరికీ చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నారు.. అభ్యంతరం చెప్పిన మొదటి భార్యను అతను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.. సొంత అక్క అని కూడా చూడకుండా ఆ యువతి కర్కశంగా ప్రవర్తించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌కు చెందిన పింటూ రాజ్‌భర్ అనే వ్యక్తి 2019లో కల్యాణ్‌పూర్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. 2020లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కాగా, తన భార్య సోదరితో పింటూ ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా పింటూపై మనసు పారేసుకుంది. ఇద్దరూ కలిసి తిరిగేవారు. ఈ క్రమంలో ఆ యువతిని పింటూ వివాహం చేసుకున్నాడు. ఆమెను తీసుకుని నేరుగా ఇంటికి వెళ్లాడు.
సొంత చెల్లి సవతిగా మారడంతో పింటూ భార్య తీవ్ర వేదనకు గురైంది. ఆ పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరూ కలిసి ఆమెను కొట్టి బయటకు గెంటేశారు. రెండేళ్ల కొడుకుతో నడిరోడ్డు మీదకు వచ్చిన యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు పింటూ, అతని రెండో భార్యపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.