Viral Video: నడిరోడ్డుపై వరద నీటిలో జలకాలాటలు.. ఫన్నీ వీడియోపై నెటిజన్ల సెటైర్లు..
ABN , First Publish Date - 2022-07-09T02:00:21+05:30 IST
వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో మహా నగరాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి.

వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో మహా నగరాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతుండడంతో నగర వాసులు ఆపసోపాలు పడుతున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. ముంబైలో సోమవారం నుంచి తీవ్రంగా వర్షాలు పడుతుండడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్కు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది.
వర్షాలకు రోడ్లపై ప్రవహిస్తున్న వరద నీటిలో ఓ వ్యక్తి జలకాలాడుతున్నాడు. హాయిగా రోడ్డుపై పడుక్కున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ముంబైలోని మలాడ్ ప్రాంతంలో వరద నీటితో నిండిపోయి ఉన్న రోడ్డుపై కార్లు, బస్సులు వెళ్తున్నాయి. అదే సమయంలో ఒక వ్యక్తి హాయిగా ఆ నీటిలో కాలు మీద కాలు వేసుకుని పడుక్కున్నాడు. ఈ వీడియోకు ఇప్పటికే పది వేలకు పైగా లైకులు వచ్చాయి. `ఈ వ్యక్తి మలాడ్లో మాల్దీవుల తరహాలో ఎంజాయ్ చేస్తున్నాడ`ని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.