చీకటిలో కొండచిలువ హల్‌చల్.. దానిని చూసిన వ్యక్తి ఏం చేశాడో చూస్తే దడ పుట్టడం ఖాయం!

ABN , First Publish Date - 2022-10-03T13:51:18+05:30 IST

విషజంతువులకు భయపడటం మనిషి స్వభావం.

చీకటిలో కొండచిలువ హల్‌చల్.. దానిని చూసిన వ్యక్తి ఏం చేశాడో చూస్తే దడ పుట్టడం ఖాయం!

విషజంతువులకు భయపడటం మనిషి స్వభావం. అదే సమయంలో విష జంతువులు వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నదని గ్రహించినప్పుడు అవి ఎదురు దాడికి దిగడం సర్వసాధారణం. అయితే విషజంతువులకు ఏమాత్రం భయపడనివారిని కూడా మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఈ కోవలోకి వచ్చే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి అతి పెద్ద కొండచిలువను నిర్భయంగా పట్టుకుని పక్కకు పడేశాడు. 


ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పుటివరకూ 75 వేల మందికి పైగా వీక్షించారు. రాత్రి చీకటిలో ఒక వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా,  కారు లైట్ల వెలుగులో అతనికి రోడ్డుపై ఒక పెద్ద కొండ చిలువ కనిపించింది. అంతే... అతను కొండచిలువ దగ్గరకు వెళ్లి దాని తోకను పట్టుకుని రోడ్డు పక్కకు నెట్టివేశాడు. దీంతో ఆ కొండచిలువ పొదల గుండా ఏటో వెళ్లిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 17 సెకన్ల వీడియోను సోషల్ మీడియా యూజర్లు తెగ ఆసక్తిగా చూస్తున్నారు. 

Updated Date - 2022-10-03T13:51:18+05:30 IST