Chennai: రోడ్డుపై అద్భుతమైన స్టంట్లతో అదరగొట్టిన యువకుడు.. ఆ తర్వాత సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-10-04T01:14:50+05:30 IST

చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంటే చాలు.. అడ్డూ అదుపూ లేకుండా రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు ఈ కాలం కుర్రాళ్లు.

Chennai: రోడ్డుపై అద్భుతమైన స్టంట్లతో అదరగొట్టిన యువకుడు.. ఆ తర్వాత సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే..

చేతిలో స్పోర్ట్స్ బైక్ ఉంటే చాలు.. అడ్డూ అదుపూ లేకుండా రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు ఈ కాలం కుర్రాళ్లు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు పొందడం కోసం తాపత్రయపడుతున్నారు. ఆ క్రమంలో తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. తాజాగా చెన్నై రోడ్లపై హైదరాబాద్‌కు చెందిన అలెక్స్ అనే యువకుడు ప్రమాదకర బైక్ స్టంట్ చేశాడు. ఆ స్టంట్‌ను అతని స్నేహితులు చిత్రీకరించారు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియోలను చూసిన కొందరు చెన్నై ట్రాఫిక్ పోలీస్ విభాగానికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న చెన్నై పోలీసులు అలెక్స్‌ను, అతని బృందాన్ని పట్టుకున్నారు. అందరినీ జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వారందరి చేత పోలీసులు సామాజిక బాధ్యత తెలిసొచ్చేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. చెన్నైలోని తేనాంపేట సిగ్నల్ వద్ద రోడ్డు భద్రతకు సంబంధించిన కరపత్రాలను వారి చేత అందరికీ ఇప్పించారు. అలాగే రోడ్డు భద్రతకు సంబంధించిన ఫ్లకార్డులను ఆ యువకుల చేతుల్లో పెట్టి  ప్రధాన సిగ్నళ్ల దగ్గర నిలబెట్టారు. 



Updated Date - 2022-10-04T01:14:50+05:30 IST

Read more