పెళ్లై రెండేళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో.. భర్త షాకింగ్ నిర్ణయం!.. భార్యని మరొకరితో..

ABN , First Publish Date - 2022-05-30T08:57:29+05:30 IST

వివాహం జరిగిన రెండేళ్లు తరువాత కూడా పిల్లలు పుట్టకపోవడంతో ఆ యువకుడు మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. డాక్టర్లకు చూపిస్తే సమస్య ఏమిటో తెలుస్తుందని భార్య చెప్పినా అతను వినలేదు. ఇంట్లోనే తన సమస్యకు సమాధానం వెతకాలనుకున్నాడు. అందుకోసం ఒక దారుణ నిర్ణయం తీసుకున్నాడు...

పెళ్లై రెండేళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో.. భర్త షాకింగ్ నిర్ణయం!.. భార్యని మరొకరితో..

వివాహం జరిగిన రెండేళ్లు తరువాత కూడా పిల్లలు పుట్టకపోవడంతో ఆ యువకుడు మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. డాక్టర్లకు చూపిస్తే సమస్య ఏమిటో తెలుస్తుందని భార్య చెప్పినా అతను వినలేదు. ఇంట్లోనే తన సమస్యకు సమాధానం వెతకాలనుకున్నాడు. అందుకోసం ఒక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. అందుకోసం తన భార్యపై అత్యాచారం చేయమని సోదరుడిని అడిగాడు. 


వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో నివసించే కాలిచరణ్ సింగ్(పేరు మార్చబడినది) 2015లో షర్మిల(పేరు మార్చబడినది) వివాహం చేసుకున్నాడు. కానీ రెండేళ్లు గడిచినా సంతానం కలుగకపోవడంతో అతను మానసికంగా చాలా బాధపడేవాడు. డాక్టర్ల వద్దకు వెళితే తనలో లోపం ఉన్న విషయం బయటపడుతుందని భయపడ్డాడు. భార్య ఎన్నిసార్లు సంతానలేమికి చికిత్స గురించి చెప్పినా అతను వినలేదు. ఎలాగైనా తనకు పిల్లలు కావాలనుకున్నాడు. 


అందుకోసం అదే ఇంట్లో ఉంటున్న తన అన్న, వదినల వద్దకు వెళ్లి సహాయం అడిగాడు. తన భార్యతో శృంగారం చేయాలని కోరాడు. కాలిచరణ్ చెప్పిన మాటలు విని మొదట షాకైన అతని అన్న, వదినలు.. ఆ తరువాత అందుకు అంగీకరించారు కానీ అతని భార్య అందుకు అంగీకరించలేదు. దీంతో కాలిచరణ్ భార్యపై అతడి అన్న అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసే సమయంలో కాలిచరణ్ వదిన కూడా అదే గదిలో ఉంది. 


ఈ విషయం బయటికి చెబితే పరువు పోతుందని భావించన షర్మిల ఈ అన్యాయాన్ని తన గుండెల్లోనే దాచుకుంది. కానీ ఆ తరువాత కాలిచరణ్ అన్న ప్రతిరోజూ ఆమె వద్దకు వచ్చి తన మృగవాంచను తీర్చమనేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోతే బలవంతం చేసేవాడు. అలా మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత ఉద్యోగరీత్యా కాలిచరణ్ తనభార్యను తీసుకొని ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్ వెళ్లిపోయాడు. 


అక్కడ కూడా పిల్లలు పుట్టకలేదని.. అందుకు కారణం షర్మిలలో లోపం ఉందని చెప్పేవాడు. క్రమంగా పిల్లల పుట్టడంలేదని.. భార్యను హింసించేవాడు. ఒకరోజు కోపంలో షర్మిలను చితకబాది ఇంటి నుంచి బయటికి తోసేశాడు. షర్మిల తన పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులతో జరిగిన విషయమంతా చెప్పింది. అప్పుడు పుట్టింటివారు ఇచ్చిన ధైర్యంతో షర్మిల తన భర్త, బావ(భర్త సోదరుడు), భర్త వదినపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు కాలిచరణ్‌ని అరెస్టు చేయడానికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది.


Updated Date - 2022-05-30T08:57:29+05:30 IST