పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు.. విషయం తెలిసిన చిన్నాన్న ఏం చేశాడంటే?

ABN , First Publish Date - 2022-06-02T07:47:00+05:30 IST

ఊరి పొలిమేర్లలో ఒక యువకుడి శవం కనిపించడంతో ఆ ఊరి జనాలంతా షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని కుశాల్ మేఘారామ్‌గా గుర్తించారు...

పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడు.. విషయం తెలిసిన చిన్నాన్న  ఏం చేశాడంటే?

ఊరి పొలిమేర్లలో ఒక యువకుడి శవం కనిపించడంతో ఆ ఊరి జనాలంతా షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడిని కుశాల్ మేఘారామ్‌గా గుర్తించారు. అతని శవానికి పోస్టుమార్టం చేయబోతుంటే.. గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆస్పత్రి ముందు ధర్నాకు కూర్చున్నారు. 


కుశాల్‌ను ఎవరో హత్య చేశారని కాబట్టి పోస్టుమార్టం తప్పనిసరి అని పోలీసులు నచ్చజెప్పడంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు. పోస్టుమార్టం అనంతరం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు.. ఇదంతా వివాహేతర సంబంధం కారణంగానే జరిగినట్లు తెలిసింది. మృతుడు కుశాల్ తన బాబాయ్(తండ్రి సోదరుడు) ఇంట్లో లేని సమయంలో కుశాల్ వచ్చేవాడని, అతనికి తన పిన్ని(బాబాయ్ భార్య)తో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ఈ విషయం తెలిసిన బాబాయ్ డాలూరామ్ తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. కుశాల్‌ను తీవ్రంగా కొట్టి చంపేశాడు. 


తీవ్రమైన గాయాల కారణంగా అతను చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి ఊరి చివర పడేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో వెలుగు చూసింది. హత్య కేసులో డాలూరామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారణ చేస్తున్నామని, కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.


Updated Date - 2022-06-02T07:47:00+05:30 IST