మార్నింగ్ వాక్‌లో పరిచయమైన యువతితో ప్రేమ.. రూ.కోటి అడిగితే ఇవ్వలేదని దూరం.. దీంతో చివరకు..

ABN , First Publish Date - 2022-02-28T19:32:56+05:30 IST

వారిద్దరూ ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌లో కలుసుకునేవారు.. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది..

మార్నింగ్ వాక్‌లో పరిచయమైన యువతితో ప్రేమ.. రూ.కోటి అడిగితే ఇవ్వలేదని దూరం.. దీంతో చివరకు..

వారిద్దరూ ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌లో కలుసుకునేవారు.. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.. ఆ చనువుతో అతడిని ఆ యువతి కోటి రూపాయలు అడిగింది.. అతను ఎంతగా ప్రయత్నించినా డబ్బులు సమకూరలేదు.. దీంతో అతడిని ఆమె దూరం పెట్టింది.. అతడు ఎంత ప్రయత్నించినా మాట్లాడలేదు.. తీవ్ర మనస్థాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. 


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నానా చిలోడాకు చెందిన లఖిన్ మఖియా అనే వ్యక్తి ప్రతిరోజూ తన ఇంటకి సమీపంలో ఉన్న పార్క్‌కి వాకింగ్‌కు వెళ్లేవాడు. ఆ క్రమంలో అతనికి ఒక యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత ఆ యువతి తాను పై చదువుల కోసం కెనడా వెళ్తానని, ఖర్చుల కోసం కోటి రూపాయలు కావాలని అడిగింది. రూ.కోటి కోసం లఖిన్ ఎంతగానో ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. 


అదే విషయం ప్రేయసికి చెప్పాడు. దీంతో ఆమె లఖిన్‌ను దూరం పెట్టింది. అతడి ప్రేమను తిరస్కరించింది. దీంతో లఖిన్ తీవ్రంగా కుంగిపోయాడు. ఈ నెల 21న తన అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ యువతిపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్‌లను పోలీసులకు అందించారు. వారం రోజులు గడుస్తున్నా యువతిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వారు తాజాగా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. 

Updated Date - 2022-02-28T19:32:56+05:30 IST