పిల్లలు పుట్టడం లేదని మనుమడి దారుణం.. తాత మంత్రగాడని తెలిసి.. అతడి వద్దకు వెళ్లి ఏం చేశాడంటే?..

ABN , First Publish Date - 2022-05-01T07:43:28+05:30 IST

ఒక యువకుడికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. పిల్లల కోసం ఎంత చెయ్యాలో అంతా చేశారు. కానీ ఆ దంపతులకు సంతానం కలుగలేదు. తాతయ్య వల్లే తనకు పిల్లలు పుట్టడం లేదని ఆ యువకుడు నమ్మాడు. దాంతో అర్ధరాత్రి తాతను అనుసరించి వెళ్లి కత్తితో ఎడాపెడా దాడి చేసి చంపేశాడు...

పిల్లలు పుట్టడం లేదని మనుమడి దారుణం..  తాత మంత్రగాడని తెలిసి.. అతడి వద్దకు వెళ్లి ఏం చేశాడంటే?..

ఒక యువకుడికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. పిల్లల కోసం ఎంత చెయ్యాలో అంతా చేశారు. కానీ ఆ దంపతులకు సంతానం కలుగలేదు. తాతయ్య వల్లే తనకు పిల్లలు పుట్టడం లేదని ఆ యువకుడు నమ్మాడు. దాంతో అర్ధరాత్రి తాతను అనుసరించి వెళ్లి కత్తితో ఎడాపెడా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో వెలుగు చూసింది. 


వివారాల్లోకి వెళితే.. జబల్‌పూర్‌లో నివశించే నేతారామ్ అహిర్‌వార్ (71)కి ముగ్గురు మనవళ్లు. పెద్దవాళ్లిద్దరికీ పెళ్లిళ్లు జరిగినా సంతానం లేదు. నాలుగేళ్ల క్రితం చివరి మనవడు సందీప్‌ కూడా వివాహం చేసుకున్నాడు. అతనికి కూడా పిల్లలు కలగలేదు. ఈ క్రమంలోనే సందీప్ వదినల్లో ఒకామెకు గర్భస్రావం జరిగింది. ఆ అన్నయ్య కూడా ప్రమాదంలో మరణించాడు. దీనంతటికీ కారణం తమ తాతయ్య మంత్రగాడు కావడమే అని సందీప్ నమ్మాడు. 


తన తాత ఒక మంత్రగాడు కావడం వల్లే వంశవృద్ధి జరగడం లేదని భావించాడు. ప్రభుత్వ పాఠశాలలో స్టోర్ చేసిన ధాన్యాన్ని కాపలా కాస్తున్న తన తాత నేతారామ్‌పై అర్ధరాత్రి సందీప్ కత్తితో దాడి చేసి చంపేశాడు. మొత్తమ్మీద 17 సార్లు అతనిపై దాడి చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. నేతారామ్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో సందీప్ తన నేరం ఒప్పుకోవడంతో అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-05-01T07:43:28+05:30 IST