ఎక్కడైనా మొసలి, మనిషి మధ్య స్నేహం కుదరడాన్ని చూశారా? పైగా దానికి ప్రేమగా చేపను తినిపించడాన్ని ఊహించగలరా?

ABN , First Publish Date - 2022-08-04T17:22:21+05:30 IST

మొసలికి, మనిషికి మధ్య స్నేహం కుదరడాన్ని...

ఎక్కడైనా మొసలి, మనిషి మధ్య స్నేహం కుదరడాన్ని చూశారా? పైగా దానికి ప్రేమగా చేపను తినిపించడాన్ని ఊహించగలరా?

మొసలికి, మనిషికి మధ్య స్నేహం కుదరడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? దీనికి ఎవరైనా చూడలేదనే చెబుతారు. అయితే దీనికి భిన్నమైన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మనుషులతో పాటు ఇతర జంతువులు కూడా మొసళ్లకు భయపడతాయి. ఈ వైరల్ వీడియోలో ఒక మొసలి విచిత్ర ప్రవర్తన కనిపిస్తుంది. సముద్రంలోని బోటుపై కూర్చున్న ఒక వ్యక్తి.. మొసలికి ప్రేమగా చేపను తినిపిస్తుంటాడు. అది అతనికి ఎటువంటి హాని చేయకుండా ఆ చేపను మింగుతుంది. 


ఈ దృశ్యం చూసినవారు మొసలితో అతనికి మంచి స్నేహబంధం ఏర్పడిందని అనుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో ఈ వీడియోను 40 లక్షల మందికిపైగా చూశారు. ఈ వీడియోను 32 వేల మందికి పైగా లైక్ చేశారు. అదే సమయంలో కొందరు యూజర్లు ఇది ప్రమాదకరమని అంటుంటే, మరికొందరు ఈ స్నేహాన్ని అపురూపమని అంటున్నారు. ఇలాంటి దృశ్యాన్ని గతంలో చూడలేదని కొందరు అంటున్నారు.

Read more