పెళ్లి పేరుతో 250 మహిళలకు టోకరా.. ఏకంగా రూ. కోట్లలో మోసం.. చివరకు అతని పరిస్థితి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-04-24T06:08:18+05:30 IST

నకిలీ ఐడీ, ఫొటోలను ఉపయోగించి పెళ్లి పేరుతో యువతులను మోసం చేస్తున్న ఓ ముఠాను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందిన నిందితుడు తనను తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకుని భారతీయ వనితలను మోసం చేశాడు...

పెళ్లి పేరుతో 250 మహిళలకు టోకరా.. ఏకంగా రూ. కోట్లలో మోసం.. చివరకు అతని పరిస్థితి ఏమైందంటే..

నకిలీ ఐడీ, ఫొటోలను ఉపయోగించి పెళ్లి పేరుతో యువతులను మోసం చేస్తున్న ఓ ముఠాను ఘజియాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందిన నిందితుడు తనను తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పరిచయం చేసుకుని భారతీయ వనితలను మోసం చేశాడు. ఏకంగా 250 మంది యువతులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. 


ఘజియాబాద్‌లోని రాకేష్ మార్గ్‌లో నివసిస్తున్న ఓ యువతికి మ్యాట్రోమోనియల్ సైట్ ద్వారా సింగ్ గుప్తా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో ఐటీ ఇంజనీర్‌నని చెప్పి పెళ్లి ప్రపోజ్ చేశాడు. భారత్ రాగానే పెళ్లి చేసుకుందామన్నాడు. ఓ రోజు ఫోన్ చేసి రూ.3.5 కోట్ల విలువైన నగలతో పెళ్లి చేసుకునేందుకు ఇండియా వస్తున్నానని ఆ యువతికి చెప్పాడు. తర్వాతి రోజు ఫోన్ చేసి ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు పట్టుబడ్డానని చెప్పాడు. అనిత అనే యువతి కస్టమ్స్ అధికారిణిగా నటిస్తూ ఆ యువతితో మాట్లాడింది. డబ్బులు డిమాండ్ చేసింది. ఆ విధంగా ఆ యువతి నుంచి వారు రూ.35 లక్షలు దోపిడీ చేశారు.


తాను మోసపోయానని తెలుసుకున్న యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు నైజీరియాకు చెందిన  ఉడెక్వే సిప్రియన్‌గా గుర్తించారు. అతని భార్య నోంగేసై జె కూడా అతనితో కలిసి ఈ మోసాల్లో పాల్గొంటోంది. వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఇదే తరహాలో దాదాపు మంది యువతులను మోసం చేసి రూ.కోట్లలో సంపాదించినట్ల పోలీసులు తెలిపారు.


Read more