అక్క భర్తతో సహజీవనం చేస్తున్న యువతి.. విషయం తెలిసి ఆమె సోదరుడు ఎంత దారుణానికి పాలప్పడ్డాడంటే..

ABN , First Publish Date - 2022-05-20T08:37:18+05:30 IST

అక్కను పెళ్లాడిన వ్యక్తి.. చివరకు ఆమె చెల్లెలితో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన ఆమె అన్నయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు. కత్తి తీసుకొని బావపై దాడి చేశాడు...

అక్క భర్తతో సహజీవనం చేస్తున్న యువతి.. విషయం తెలిసి ఆమె సోదరుడు ఎంత దారుణానికి పాలప్పడ్డాడంటే..

అక్కను పెళ్లాడిన వ్యక్తి.. చివరకు ఆమె చెల్లెలితో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన ఆమె అన్నయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు. కత్తి తీసుకొని బావపై దాడి చేశాడు. ఈ దాడి కారణంగా సదరు బావ మృతి చెందాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన షాజాద్ ఆలమ్ అనే వ్యక్తికి పెళ్లయింది. భార్యను ఇంటి దగ్గరే వదిలేసి ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పని కోసం అతను వచ్చాడు. అతని భార్యకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక్కడ మరో యువతిని ఆలమ్ పెళ్లాడాడు. ఆమెతో ఒక బిడ్డను కన్నాడు. తర్వాత ఏమైందో ఆమె.. అతన్ని వదిలేసింది. తన ప్రియుడితో కలిసి అదే ప్రాంతంలో వేరే చోట కాపురం పెట్టింది. దీంతో ఆలమ్.. తన రెండో భార్య చెల్లెలితో సహజీవనం ప్రారంభించాడు. వీళ్లిద్దరూ కలిసి ఉంటున్నారని రెండో భార్య తమ్ముడికి తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. బావపై కత్తితో దాడి చేశాడు. 


ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆలమ్‌ను అర్ధరాత్రి రెండు గంటలకు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ఆలమ్‌పై దాడి చేసిన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.


Read more