ప్రియురాలి తల్లి తల పగలగొట్టిన ప్రియుడు.. కారణం ఏంటంటే?

ABN , First Publish Date - 2022-04-06T08:31:52+05:30 IST

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం చాలా మంది ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక యువకుడు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి ఎవరికీ కనిపించకుండా...

ప్రియురాలి తల్లి తల పగలగొట్టిన ప్రియుడు.. కారణం ఏంటంటే?

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం చాలా మంది ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక యువకుడు మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించాడు. అర్ధరాత్రి ఎవరికీ కనిపించకుండా వెళ్లి ప్రేయసి తల్లి తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని జంజగీర్ జిల్లాలో వెలుగు చూసింది. 


స్థానికంగా నివశించే రామ్‌ప్రసాద్ ధీవర్ అనే వ్యక్తి ఇటీవల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భార్యను ఎవరో బండరాయితో కొట్టి గాయపరిచారని కేసు పెట్టాడు. అర్ధరాత్రి పూట ఆమె తలపై ఎవరో బండరాయితో బాది పారిపోయారని, ఆమెను ఆస్పత్రిలో చేర్పించామని రాంప్రసాద్ తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన రోజు నాగ్‌పూర్‌కు చెందిన రవి కశ్యప్ అనే యువకుడు ఆ పరిసర ప్రాంతాల్లో తచ్చట్లాడుతూ కొంతమంది కంటపడినట్లు పోలీసులు తెలసుకున్నారు. అతని గురించి దర్యాప్తు చేయగా.. రాంప్రసాద్ కుమార్తెను రామ్ కశ్యప్ ప్రేమించినట్లు తేలింది. దీంతో రామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారన చేశారు. ఈ క్రమంలో తన ప్రేయసికి వేరెవరితోనో పెళ్లి నిశ్చయం చేశారని, దాన్ని ఆపేందుకే ప్రియురాలి తల్లిపై దాడి చేశానని అతను అంగీకరించాడు. రాంప్రసాద్ భార్య బృహస్పతి బాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. రామ్ కశ్యప్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-04-06T08:31:52+05:30 IST