బావ చెల్లెలితో ప్రేమాయణం.. అప్పటికే ఆమె వివాహిత కావడంతో ఎంతటి ఘోరం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-08T07:55:35+05:30 IST

ఆ వ్యక్తి సోదరికి ఇటీవలె వివాహం జరిగింది.. అతను సోదరి ఇంటికి తరచుగా వెళ్లేవాడు.. ఆ క్రమంలో బావ సోదరితో ప్రేమలో పడ్డాడు.. అయితే అప్పటికే ఆమె వివాహిత.. ఆమె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఇతను అక్కడకు వెళ్లేవాడు.. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.. ఒకరోజు అతను బావకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. తీవ్ర ఆగ్రహానికి గురైన బావ...

బావ చెల్లెలితో ప్రేమాయణం.. అప్పటికే ఆమె వివాహిత కావడంతో ఎంతటి ఘోరం జరిగిందంటే..

ఆ వ్యక్తి సోదరికి ఇటీవలె వివాహం జరిగింది.. అతను సోదరి ఇంటికి తరచుగా వెళ్లేవాడు.. ఆ క్రమంలో బావ సోదరితో ప్రేమలో పడ్డాడు.. అయితే అప్పటికే ఆమె వివాహిత.. ఆమె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఇతను అక్కడకు వెళ్లేవాడు.. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.. ఒకరోజు అతను బావకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.. తీవ్ర ఆగ్రహానికి గురైన బావ ఆ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశాడు.


బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని అదామా గ్రామానికి చెందిన బహదూర్ యాదవ్ అనే వ్యక్తి తన కుమార్తెకు రాజు రంజన్‌తో వివాహం చేశాడు. పెళ్లయిన తర్వాత బహదూర్ యాదవ్ కొడుకు నాగేంద్రకుమార్ తన చెల్లెలిని చూసేందుకు తరచుగా ఆమె అత్తింటికి వెళ్లేవాడు. ఆ క్రమంలో నాగేంద్ర తన బావ అయిన రాజు వివాహిత సోదరితో ప్రేమలో పడ్డాడు. ఆమె అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడల్లా నాగేంద్ర అక్కడకు వెళ్లేవాడు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. 


ఒకరోజు వారిద్దరూ కలిసి ఉండగా రాజు చూసేశాడు. నాగేంద్రతో రాజు తీవ్రంగా గొడవ పడ్డాడు. ఆ గొడవ పెద్దది కావడంతో నాగేంద్రపై రాజు కత్తితో దాడి చేశాడు. పలుమార్లు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-04-08T07:55:35+05:30 IST