ఒంటరిగా ఉన్న తండ్రి కోసం పనిమనిషిని పెట్టాడు.. ఆ వృద్ధుడితో ఆ పనిమనిషి ఏం చేసిందో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-03-10T22:02:25+05:30 IST

తల్లి చనిపోవడంతో ఒంటరిగా ఉన్న తండ్రిని చూసుకునేందుకు అతను ఓ పనిమనిషిని పెట్టాడు..

ఒంటరిగా ఉన్న తండ్రి కోసం పనిమనిషిని పెట్టాడు.. ఆ వృద్ధుడితో ఆ పనిమనిషి ఏం చేసిందో తెలిస్తే షాక్!

తల్లి చనిపోవడంతో ఒంటరిగా ఉన్న తండ్రిని చూసుకునేందుకు అతను ఓ పనిమనిషిని పెట్టాడు.. అనంతరం వేరే ఊరు వెళ్లి వ్యాపార పనుల్లో నిమగ్నమయ్యాడు.. ఇటీవల తండ్రి కూడా మరణించాడు.. తండ్రి పేరిట ఉన్న ఆస్తుల వివరాలు చూసి కొడుకు షాకయ్యాడు.. ఆస్తుల పత్రాలన్నింటిలోనూ నామినీగా పనిమనిషి పేరు ఉండడం చూసి నివ్వెరపోయాడు.. ఆమెను నిలదీస్తే ఇంకా గట్టి షాక్ తగిలింది.. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.   


రాజస్థాన్‌లోని జైపూర్‌కు సమీపంలోని సోదాల గ్రామానికి చెందిన కమల్ కిషోర్ అనే వ్యక్తి తన తండ్రి హుకుమ్ చంద్‌ను చూసుకునేందుకు గాయత్రి అనే పనిమనిషిని ఏర్పాటు చేశాడు. తను వ్యాపార నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండడంతో ఇంట్లో తన తండ్రి పనులను చూసుకోమని గాయత్రికి చెప్పాడు. అయితే గాయత్రి ఆ వృద్ధుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఆ ఘటనలను వీడియో తీసింది. అంతేకాదు హుకుమ్ చంద్‌ను మాయ చేసి అతడి ఆస్తులకు నామినీగా తన పేరును రాయించుకుంది. 


కొన్ని రోజుల కిందట అనారోగ్యం కారణంగా హుకుమ్ చంద్ మరణించాడు. దాంతో తండ్రి పేరు మీద ఉన్న పాలసీలు, బ్యాంకు ఖాతా వివరాలను కమల్ పరిశీలించాడు. వాటన్నింటిలోనూ నామినీగా గాయత్రి పేరు కనిపించడంతో షాకయ్యాడు. వెంటనే ఆమెను నిలదీశాడు. దీంతో ఆమె బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. తనకు రూ.80 లక్షలు ఇవ్వకపోతే నీ తండ్రికి సంబంధించిన వీడియోలను బయటపెడతానని బెదిరించింది. దీంతో కమల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-03-10T22:02:25+05:30 IST