Mahesh Babu: కుటుంబ సభ్యులతో మహేష్ బాబు ఫోటోస్ వైరల్

ABN , First Publish Date - 2022-11-18T14:03:52+05:30 IST

అలాగే కుటుంబ సబ్యులు అందరితో మహేష్ బాబు తండ్రి చిత్రపటం దగ్గర కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలు అన్నీ ఈరోజు వైరల్ గా సాంఘీక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి.

Mahesh Babu: కుటుంబ సభ్యులతో మహేష్ బాబు ఫోటోస్ వైరల్
Mahesh Babu tributes to his father Krishna, with his brother Ramesh Babu's daughter and son

తండ్రి కృష్ణ గారి అంత్యక్రియలు పూర్తి చేసిన తరువాత, సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో కలిసి గురువారం తండ్రికి నీరాజనాలు ఇచ్చారు. తండ్రి కృష్ణ గారి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కనిపించారు. తరువాత చేయవలసిన కర్మల గురించి, బాబాయి ఆదిశేషగిరి రావు గారితో చర్చించినట్టుగా తెలిసింది. అలాగే అన్నయ్య రమేష్ బాబు కుటుంబ సబ్యులు కూడా వచ్చి కృష్ణ గారికి నివాళులు అర్పించారు. ఈ సమయంలో మహేష్ బాబు అందరితో మాట్లాడి తన తండ్రిని గురించిన విషయాలను ఒకసారి నెమరు వేసుకున్నట్టుగా తెలిసింది. అలాగే కుటుంబ సబ్యులు అందరితో మహేష్ బాబు తండ్రి చిత్రపటం దగ్గర కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలు అన్నీ ఈరోజు వైరల్ గా సాంఘీక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. మహేష్ బాబుకి అన్నయ్య రమేష్ బాబు అంటే విపరీతమయిన ప్రేమ, అలాగే అన్నయ్య పిల్లలకు మిగతా కుటుంబ సబ్యులకి కూడా ఇప్పుడు మహేష్ బాబు అండగా వుండి పెద్ద దిక్కుగా నిలబడుతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. రమేష్ బాబు, కృష్ణ గారు, ఇందిరా దేవి గారు ఇందరిని పోగొట్టుకున్న మహేష్ బాబు ఇప్పుడు ఆ కుటుంబ బాధ్యతలని తన మీదకి తీసుకొని ఎవరికి ఏమి కావాలన్న తానే చూసుకోవాలి అని, ఆ విషయమే కుటుంబ సబ్యులందరికి చెప్పినట్టుగా తెలిసింది. ఎవరినీ భయపడవద్దని, తాను అండగా వుంటానని వాళ్ళందరికీ మహేష్ బాబు మాట ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే చిత్ర పరిశ్రమకి చెందిన కొందరు పెద్దలు సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కృష్ణ గారి అంత్యక్రియల ఏర్పాట్లలో ఇంకా ఇతరత్రా ఆ సమయంలో సహాయం చేసిన వారందరూ కూడా గురువారం నాడు పద్మాలయా స్టూడియో లో కలిసి కృష్ణ గారిని నీరాజనలి ఇచ్చి మహేష్ కి ధైర్యం చెప్పారని తెలిసింది.

Updated Date - 2022-11-18T14:12:13+05:30 IST