Maharashtra: కూతురు కిడ్నాప్ అంటూ పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు.. విచారణలో బయటపడిన షాకింగ్ విషయం!
ABN , First Publish Date - 2022-10-17T20:45:30+05:30 IST
ఆ బాలిక వయసు 14 సంవత్సరాలు.. ఎనిమిదో తరగతి చదువుతోంది..
ఆ బాలిక వయసు 14 సంవత్సరాలు.. ఎనిమిదో తరగతి చదువుతోంది.. గత శుక్రవారం మధ్యాహ్నం ఆ బాలిక ఇంటి నుంచి అదృశ్యమైంది.. దీంతో తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. సాయంత్రానికి ఆ బాలిక ఆచూకీ తెలిసింది.. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి 150 కి.మీ. దూరం తీసుకెళ్లారని చెప్పింది.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.. ఆ బాలికను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అమె కట్టుకథ అల్లి చెప్పిందని తేలింది.
ఇది కూడా చదవండి..
Shocking Video: టోల్‌గేట్‌ను బలంగా ఢీకొట్టిని కారు.. బయటకు ఎగిరిపడ్డ డ్రైవర్.. ఆ వీడియో చూస్తే..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా నందన్వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి అదృశ్యమైంది. బస్సు ఎక్కి 150 కి.మి. ప్రయాణించి సాయంత్రానికి చంద్రపూర్ చేరుకుంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసినట్టు చెప్పింది. అప్పటికే బాలిక తల్లిదండ్రులు నందన్వన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రాపూర్ పోలీసులు.. నందన్వన్ పోలీసులకు, బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ బాలిక చెప్పిన వివరాల మేరకు విచారణ ప్రారంభించారు.
విచారణలో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ బాలిక ఒంటరిగానే బస్సు ఎక్కినట్టు కనిపించింది. దీంతో పోలీసులు ఆ బాలికను విచారించగా అసలు విషయం చెప్పింది. చదువుకోవడం లేదని తల్లి మందలించడంతోనే ఇంటి నుంచి వెళ్లిపోయానని చెప్పింది. తల్లిదండ్రులను భయపెట్టేందుకు కిడ్నాప్ డ్రామా ఆడానని అంగీకరించింది.