సైలెంట్‌గా ఇంట్లోకి దూరిన దొంగ.. చివరకు అతడు ఎత్తుకెళ్లిన వస్తువులను.. సీసీ కెమెరాలో చూసి అంతా షాక్..

ABN , First Publish Date - 2022-09-09T23:28:08+05:30 IST

కొందరు దొంగలు విచిత్ర స్వభావం కలిగి ఉంటారు. వారు చేసే దొంగతనాలు అంత విచిత్రంగా ఉంటాయి మరి. కొందరు అగ్గిపెట్టెలు, సబ్బు బిల్లలను ఎత్తుకెళ్తే.. మరికొందరు పాత దుస్తులను..

సైలెంట్‌గా ఇంట్లోకి దూరిన దొంగ.. చివరకు అతడు ఎత్తుకెళ్లిన వస్తువులను.. సీసీ కెమెరాలో చూసి అంతా షాక్..

కొందరు దొంగలు విచిత్ర స్వభావం కలిగి ఉంటారు. వారు చేసే దొంగతనాలు అంత విచిత్రంగా ఉంటాయి మరి. కొందరు అగ్గిపెట్టెలు, సబ్బు బిల్లలను ఎత్తుకెళ్తే.. మరికొందరు పాత దుస్తులను ఎత్తుకెళ్తుంటారు. అయితే కొన్నిసార్లు జరిగే దొంగతనాలను చూస్తే.. ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఆశ్చర్యకరమైన దొంగతనం మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఓ దొంగ సైలెంట్‌గా ఇంట్లోకి దూరాడు. చివరకు అతడు ఎత్తుకెళ్లిన వస్తువులను సీసీ కెమెరాలో చూసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌ పరిధి గౌస్‌పురా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 3న ఓ దొంగపై పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు దొంగ ఓ ఇంట్లోకి దూరడాన్ని గుర్తించారు. అయితే వెళ్తూ వెళ్తూ అతను మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్లడం చూసి అంతా షాక్ అయ్యారు. రాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళల లోదుస్తులను తీసుకుని, అలాగే చొక్కా జేబులో ఉన్న రూ.500లు కూడా ఎత్తుకెళ్లాడు. ఇటీవల స్థానికంగా చాలామంది మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్లినట్లు విచారణలో తెలిసింది. 

Viral Video: మీకు ఉదయాన్నే నిద్ర లేవాలంటే బద్ధకమా..? అయితే ఈ బెడ్ మీద ఒక్కసారి పడుకుని చూడండి..


అయితే ఇది సీరియస్ విషయం కాకపోవడంతో ఫిర్యాదుచేయడానికి ఎవరూ ముందుకురాలేదు. ఎట్టకేలకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, జపాన్‌లో కూడా ఓ వ్యక్తి ఇలాంటి దొంగతనాలకే పాల్పడేవాడట. టెట్సువో ఉరాటా అనే దొంగ ఏడాది క్రితం.. దక్షిణ జపనీస్ నగరమైన బెప్పులోని అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి మహిళ లోదుస్తులను ఎత్తుకెళ్లాడు. ఇలా మొత్తం 700జతల లోదుస్తులను సేకరించాడు. ఆగస్ట్ 24న లాండ్రోమాట్‌లో 21ఏళ్ల మహిళ ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చివరకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ప్రస్తుతం ఈ రెండు ఘటనలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

కొడుకు మృతదేహాన్ని చూసిన తర్వాత.. ఆ తల్లి గుండె కూడా ఆగిపోయింది..!

Updated Date - 2022-09-09T23:28:08+05:30 IST

Read more