ఒక్క నెలలోనే 17 వేల ఆవులను చంపేసిన పాడు వైరస్.. 8 రాష్ట్రాలకు వ్యాపించిన ‘మాయ రోగం’

ABN , First Publish Date - 2022-08-13T17:08:57+05:30 IST

దేశంలో గత నెలలో 17 వేలకు పైగా పశువులు...

ఒక్క నెలలోనే 17 వేల ఆవులను చంపేసిన పాడు వైరస్.. 8 రాష్ట్రాలకు వ్యాపించిన ‘మాయ రోగం’

దేశంలో గత నెలలో 17 వేలకు పైగా పశువులు... ముఖ్యంగా ఆవులు చర్మ వ్యాధి కారణంగా మృతిచెందాయి. ఈ ప్రాణాంతక వైరస్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సహా దేశంలోని 8 రాష్ట్రాలకు వ్యాపించి పశువులను చంపుతోంది. లంపీ వైరస్ కారణంగా ఒక్క గుజరాత్‌లోనే రోజుకు దాదాపు లక్ష లీటర్లు పాల ఉత్పత్తి తగ్గింది. లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఆవులు, గేదెలు వంటి పశువులలో కాప్రిపాక్స్ అనే వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది ఒక జంతువు నుండి మరొక జంతువుకు చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ మేకలలో, గొర్రెలలో గున్యా వైరస్‌ను పోలి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పశువులకు లంపి వ్యాధి పెనుముప్పుగా పరిగణిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వైరస్ వల్ల గేదెల కంటే ఆవులు ఎక్కువగా చనిపోతున్నాయి. 


గేదెల సహజ రోగనిరోధక శక్తి ఆవుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం లంపి వ్యాధి అనేది దోమలు, ఈగల వంటి జీవుల ద్వారా వ్యాపించే వ్యాధి. నిపుణుల అభిప్రాయం  వర్షాకాలంలో వేగంగా వ్యాపిస్తుంది. రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో వైద్యం అందక పోవడంతో చర్మవ్యాధులు సోకి జంతువులు మృత్యువాత పడడం ఎప్పటినుంచో జరుగుతోంది. దీనిపై బీజేపీ కార్యకర్తలు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. నగరంలోని నెహ్రూనగర్‌లో లంపీ చర్మ వ్యాధితో బాధపడుతున్న ఆవులకు ఆయుర్వేద లడ్డూలను తినిపించే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చైర్మన్ దిలీప్ మాలి, కౌన్సిలర్లు శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో వ్యాపించిన చర్మవ్యాధి కారణంగా ఆవులు మృతి చెందాయని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రణవీర్ సింగ్ భాదు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.  లీల్‌సర్‌-పన్వారీ గ్రామపంచాయతీ ప్రతినిధులు చునారామ్‌ ఆయుర్వేద కిట్‌ల ప్యాకెట్లను సిద్ధం చేసి పశువుల యజమానులకు అందజేసి ఆవులను చర్మవ్యాధుల బారిన పడకుండా కాపాడుతున్నారు.  పశువుల లంపీ చర్మవ్యాధుల నివారణకు సంబంధించిన ఏరియా సర్పంచ్‌లు, గ్రామాభివృద్ధి అధికారుల సమావేశం జరిగింది. పశువైద్యాధికారి డాక్టర్ పూన్మారం చౌదరి మాట్లాడుతూ జంతువులు ఉండే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈగలు, దోమల నుండి పశువుకు రక్షణ కల్పించాలన్నారు. ఏటాడ - కోనార యువకులు లంపీ చర్మవ్యాధి నుండి జంతువులను కాపాడుకోవాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు అలాగే వ్యాధి నివారణకు అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు. కాగా ఈ లంపీ వ్యాధి 8 రాష్ట్రాలకు వ్యాపించిందని సమాచారం. 

Updated Date - 2022-08-13T17:08:57+05:30 IST