పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే మాత్రం మరీ ఇలాంటి పనికి పాల్పడాలా..? ఊళ్లోంచి అదృశ్యమైన ఓ ప్రేమ జంట ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-10-01T20:32:10+05:30 IST

ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు.. ఆ మైనర్ బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది..

పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోతే మాత్రం మరీ ఇలాంటి పనికి పాల్పడాలా..? ఊళ్లోంచి అదృశ్యమైన ఓ ప్రేమ జంట ఏం చేసిందంటే..

ఆ బాలిక వయసు 17 సంవత్సరాలు.. ఆ మైనర్ బాలిక ఓ యువకుడితో ప్రేమలో పడింది.. వివాహానికి పెద్దలు అంగీకరించలేదు.. దీంతో రెండ్రోజుల క్రితం ఆ బాలిక ఇంటి నుంచి అదృశ్యమైంది.. యువకుడితో కలిసి వెళ్లిపోయింది.. చివరకు తన ప్రియుడితో కలిసి ఉరేసుకుని చనిపోయింది.. వారి మృతదేహాలను పోలీసులు గుర్తించి గ్రామానికి తరలించారు.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

ఎన్నేళ్లయినా సరే.. నువ్వు నాకు కనిపిస్తే చంపేస్తా.. ఇదీ ప్రేమ పెళ్లి చేసుకున్న చెల్లికి ఓ అన్న వార్నింగ్.. 4 ఏళ్ల తర్వాత..


రతన్‌పూర్‌కు సమీపంలోని పెండ్ర గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదృశ్యమైందని కుటుంబ సభ్యులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం నుంచి బాలిక కనిపించకుండా పోయిందని తెలిపారు. ఆమె కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. శనివారం ఉదయం బిలాస్‌పూర్‌లో ఓ చెట్టుకు ఆ యువతి మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆమెతో పాటు ఆమె ప్రియుడి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ యువకుడు మార్వాహికి చెందిన వాడని పోలీసులు గుర్తించారు. ఇరువురి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.


గురువారం ఉదయం 11 గంటలకు బాలిక కుట్టు పని నేర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఇక, ఆ యువకుడు కూడా గురువారం నుంచి కనిపించకుండా పోయాడు. ఘటనా స్థలంలో యువకుడి బైక్ కూడా లభ్యమైంది. యువకుడు, యువతీ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో ఇద్దరూ ఆత్మహత్యలు చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసులో ముందుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.   

Read more