నిశ్చితార్థం అయిన మరుసటి రోజే యువతి హత్య.. ఆ ఘాతుకం ఎవరు చేశారంటే..

ABN , First Publish Date - 2022-05-20T08:34:24+05:30 IST

తను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలిసి ఆ యువకుడు ఆగలేకపోయాడు. ప్రేయసికి ఫోన్ చేసి మాయమాటలు చెప్పాడు. చివరగా ఒక్కసారి కలుద్దామని బ్రతిమాలాడు...

నిశ్చితార్థం అయిన మరుసటి రోజే యువతి హత్య.. ఆ ఘాతుకం ఎవరు చేశారంటే..

తను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలిసి ఆ యువకుడు ఆగలేకపోయాడు. ప్రేయసికి ఫోన్ చేసి మాయమాటలు చెప్పాడు. చివరగా ఒక్కసారి కలుద్దామని బ్రతిమాలాడు. దాంతో కలవడానికి వచ్చిన యువతిని గొంతు పిసికి చంపేశాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ సమీపంలో వెలుగు చూసింది. 


రేఖా అనే యువతికి ఈ నెల మూడో తేదీన నిశ్చితార్థం అయింది. ఇదే నెల 25న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచే కనిపించకుండా పోయింది. ఆమె కుటుంబ సభ్యులకు ఎవరో ఫోన్ చేసి.. రేఖ మృతదేహం ఊరికి సమీపంలోని ఒక నీటి కుంటలో ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో రేఖకు ఒక ప్రియుడు ఉన్నాడని గుర్తించారు. అతని పేరు వినోద్ అని తెలియడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా తను చేసిన దుర్మార్గాన్ని వినోద్ బయటపెట్టాడు. 


రేఖకు నిశ్చితార్థం జరిగిందని తెలిసి తనకు కోపం వచ్చిందని, ఆమెకు మాయమాటలు చెప్పి కలిశానని అంగీకరించాడు. ఆ సమయంలో తనతో పారిపోవాలని ఆమెను అడిగానని, కానీ ఆమె ససేమిరా అన్నదని చెప్పాడు. దీంతో ఆమె మెడలో ఉన్న చున్నీతోనే గొంతు పిసికి చంపేశానని, ఆ తర్వాత శవాన్ని చెరువు పక్కనే రాళ్ల కింద పూడ్చేశానని వివరించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Read more