Viral News: ప్రియురాలు అడిగిందని.. స్నేహితుడితో కలిసి ప్రియుడి దారుణం.. 75ఏళ్ల వృద్ధురాలిని..
ABN , First Publish Date - 2022-12-15T09:52:55+05:30 IST
ప్రియురాలి గొంతెమ్మ కోరిక తీర్చేందుకు ఆ ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కలిసి 75ఏళ్ల వృద్ధురాలి(75Years Old) ప్రాణాలు తీశాడు. దీంతో ఈ ఘటన..
ఇంటర్నెట్ డెస్క్: ప్రియురాలి గొంతెమ్మ కోరిక తీర్చేందుకు ఆ ప్రియుడు దారుణానికి పాల్పడ్డాడు. స్నేహితుడితో కలిసి 75ఏళ్ల వృద్ధురాలి(75Years Old) ప్రాణాలు తీశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అయితే.. ప్రియురాలి గొంతెమ్మ కోరికకు, 75ఏళ్ల వృద్ధురాలి హత్యకు సంబంధం ఏంటి? అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్(Madhyapradesh)లోని మందసౌర్ జిల్లాలో కమ్లాపూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో నివసిస్తున్న 75ఏళ్ల వృద్ధురాలు హత్యకు గురైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. వృద్ధురాలి ఒంటిపై ఆభరణాలు చోరీ అయినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపి, కేవలం 12 గంటల్లోనే హంతకులను పట్టుకున్నారు.
అదే గ్రామానికి చెందిన నగేష్, సునీల్ భిల్ అనే ఇద్దరు యువకులే ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన రీతిలో ప్రశ్నించారు. దీంతో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. గత కొంత కాలంగా తాను ఓ యువతిని ప్రేమిస్తున్నాని(Love) నగేష్ చెప్పాడు. ఈ క్రమంలోనే తన ప్రేయసి తాజాగా గిఫ్ట్ అడిగిందని.. అయితే అందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో స్నేహితుడు సునీల్ భిల్తో కలిసి రమీబాయ్ను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసిన అధికారులు.. వాళ్ల వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.