LoveToday: ‘మీడియాపై ఉన్న నమ్మకమే ఈ విజయం’

ABN , First Publish Date - 2022-12-12T10:41:57+05:30 IST

తాను హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘లవ్‌టుడే’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించడానికి మీడియాపై తనకున్న నమ్మకమేనని దర్శక నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ అన్నాడు.

LoveToday: ‘మీడియాపై ఉన్న నమ్మకమే ఈ విజయం’
love today

తాను హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘లవ్‌టుడే’ (Love Today) చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించడానికి మీడియాపై తనకున్న నమ్మకమేనని దర్శక నటుడు ప్రదీప్‌ రంగనాథన్‌ (Pradeep Ranganathan) అన్నాడు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.వంద కోట్ల కలెక్షన్ల (Collections) క్లబ్‌ దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మీడియా (Media)కు ధన్యవాదాలు తెలిపేందుకు ‘థ్యాంక్స్‌ మీట్‌’ను చిత్ర బృందం (Movie Team) ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ప్రదీప్‌ మాట్లాడుతూ.. ‘ఈ స్ర్కిప్టుపై 50 శాతం నమ్మకం నాకుంటే, మిగిలిన నమ్మకం మీడియాపై ఉంది. ఒక మంచి చిత్రానికి మీడియా ఎప్పుడూ అండగా ఉంటుందని నమ్ముతాను. ‘కోమాలి’ చిత్రంతో ఇది నిరూపణ అయింది. ఇపుడు మరోసారి నిజమైంది. ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌ రిలీజైనప్పటి నుంచే మీడియాలో పాజిటివ్‌గా ఆర్టికల్స్‌ వచ్చాయి. అందుకే మంచి ఓపెనింగ్స్‌ లభించాయి. ఈ ఏడాది టాప్‌-10 మూవీల్లో ఇది ఒక చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను’ చెప్పాడు.

love-today3.jpg

ఈ చిత్ర నిర్మాణంలో వెన్నెముకగా ఉన్న ఏజీఎస్‌ సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ అర్చన కల్పాతి, ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత వెంకట్‌ మాణిక్యం, ఏజీఎస్‌ సీఎఫ్‌వో రంగరాజన్‌ ప్రసంగించారు. కాగా, ‘లవ్‌టుడే’ చిత్రాన్ని కల్పాతి ఎస్‌.అగోరం, కల్పాతి ఎస్‌.గణేశ్‌, కల్పాతి ఎస్‌ సురే్‌ష సంయుక్తంగా ఏజీఎస్‌ ఎంటర్‌టైన్మెంట్‌పై నిర్మించారు. హీరోయిన్‌గా ఇవానా, ఇతర పాత్రల్లో రాధిక, సత్యరాజ్‌ నటించగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

Updated Date - 2022-12-12T10:42:03+05:30 IST