-
-
Home » Prathyekam » Lord Ganesha on Indonesian currency read here why prvn spl-MRGS-Prathyekam
-
Indonesia: ముస్లిం దేశ కరెన్సీపై గణపతి బొమ్మ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన హిందువుల దైవం!
ABN , First Publish Date - 2022-09-17T13:30:02+05:30 IST
ఇండోనేషియా.. ఇది ఒక ముస్లిం దేశం. కానీ ఈ దేశ కరెన్సీపై హిందువుల దైవం.. గణపతి బొమ్మ ముద్రించి ఉంటుంది. ఇలా ముద్రించడం వెనక పెద్ద కారణమే ఉంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. కరెన్సీ నోట్లపై గణపతి బొమ్మ(Lord Ganesha)ను ము

ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియా.. ఇది ఒక ముస్లిం దేశం. కానీ ఈ దేశ కరెన్సీపై హిందువుల దైవం.. గణపతి బొమ్మ ముద్రించి ఉంటుంది. ఇలా ముద్రించడం వెనక పెద్ద కారణమే ఉంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. కరెన్సీ నోట్లపై గణపతి బొమ్మ(Lord Ganesha)ను ముద్రించడం వల్ల.. ఆ దేశానికి పెద్ద మేలే జరిగిందని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఇంతకూ ఇండోనేషియా గణపతి బొమ్మను తమ కరెన్సీ నోట్లపై ఎందుకు ముద్రించింది. అలా చేయడం వల్ల ఆ దేశానికి కలిగిన లబ్ధి ఏంటనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం ఇండోనేషియా(Indonesia). ఈ దేశంలో దాదాపు 87.5శాతం మంది ప్రజలు ఇస్లాం మత సంప్రదాయాలను పాటిస్తారు. అక్కడ హిందూ ప్రజల సంఖ్య కేవలం 3 శాతమే. అయినా దేశ కరెన్సీపై హిందువుల దైవం గణపతి బొమ్మను ముద్రించారు. ఆ దేశ ప్రజలు ఇస్లాం మత సంప్రదాయాలను పాటించినప్పటికీ.. గణేశుడిని చదువుకు సంబంధించిన దేవుడిగా నమ్ముతారు. కొన్ని ఏళ్ల కిందట దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయిన సమయంలో.. అక్కడి ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఇండోనేషియా ప్రభుత్వం 20వేల నోటుపై గణేశుడి బొమ్మను ముద్రించింది. అప్పటి నుంచి క్రమంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందట. ఈ విషయాన్ని అక్కడి ప్రజలు చాలా బలంగా విశ్వసిస్తారు.
ఇండోనేషియా కరెన్సీని రూపయ్య అంటారు. 20వేల రూపయ్య నోటు(Indonesian currency)పై ఒక వైపున గణపతి బొమ్మ ఉంటుంది. వినాయకుడి పక్కనే ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి ఫొటో కూడా ఉంటుంది. నోటుకు మరోపక్కన ఉపాధ్యాయుడు, విద్యార్థులతో కూడిన ఫొటోను మనం చూడవచ్చు.
