Argentina win: కేరళలో ఉచితంగా బిర్యానీ...రెస్టారెంట్ ముందు బారులు తీరిన జనం

ABN , First Publish Date - 2022-12-20T06:13:14+05:30 IST

2022 ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా జట్టు కైవసం చేసుకోవడంతో కేరళ రాష్ట్రంలోని త్రిస్సూరు నగరంలోని ఓ రెస్టారెంట్ యజమాని....

Argentina win: కేరళలో ఉచితంగా బిర్యానీ...రెస్టారెంట్ ముందు బారులు తీరిన జనం
Long queue at Kerala eatery

త్రిస్సూర్ (కేరళ): 2022 ఫిఫా వరల్డ్ కప్‌ను అర్జెంటీనా జట్టు కైవసం చేసుకోవడంతో కేరళ రాష్ట్రంలోని త్రిస్సూరు నగరంలోని ఓ రెస్టారెంట్ యజమాని వెయ్యిమందికి ఉచితంగా చికెన్ బిర్యానీ(Free Chicken Biryani) పంపిణీ చేసిన ఘటన వెలుగుచూసింది. (Kerala eatery)ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో జరిగిన 2022 ఫిఫా(FIFA) ప్రపంచ కప్‌లో అర్జెంటీనా అద్భుతమైన విజయాన్ని(Argentinas win) ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వేడుకలు జరుపుకున్నారు.కేరళలో కనీవినీ ఎరుగని వేడుకలో త్రిస్సూర్‌లోని ఒక రెస్టారెంట్‌లో(Restaurant in Thrissur) మొదటి వెయ్యి మంది ఖాతాదారులకు ఉచితంగా చికెన్ బిర్యానీ ఇస్తామని యజమాని ప్రకటించడంతో బయట ప్రజలు బారులు తీరారు.

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించిన తర్వాత హోటల్ యజమాని షిబు పి ఉచితంగా బిర్యానీ ఉచితంగా అందిస్తానని మ్యాచ్‌కు ముందు ప్రకటించారు.ఉచితంగా బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ ప్రారంభించారు. మెస్సీ ట్రోఫికి అర్హుడని, తాను 1500 మందికి ఉచితంగా చికెన్ బిర్యానీ అందించామని మెస్సీ అభిమాని అయిన శిబు చెప్పారు. ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని అర్జెంటీనా జట్టు గెలిచిన తర్వాత కేరళలో మెస్సీ అభిమానులు వేడుకలు జరుపుకున్నారు.

Updated Date - 2022-12-20T08:25:31+05:30 IST