క్రాసింగ్ దగ్గర రైలును ఆపిన డ్రైవర్.. ఎందుకు ఆపాడో తెలిస్తే షాక్ అవడం ఖాయం!

ABN , First Publish Date - 2022-02-22T22:53:47+05:30 IST

అదొక క్రాసింగ్ జంక్షన్.. రైలు వెళ్లిపోతే పట్టాలు దాటుదామని చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు..

క్రాసింగ్ దగ్గర రైలును ఆపిన డ్రైవర్.. ఎందుకు ఆపాడో తెలిస్తే షాక్ అవడం ఖాయం!

అదొక క్రాసింగ్ జంక్షన్.. రైలు వెళ్లిపోతే పట్టాలు దాటుదామని చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు.. అయితే ఆ క్రాసింగ్ దగ్గరకు రాగానే ఆ రైలు ఆగిపోయింది.. రైలు డ్రైవర్ (లోకో పైలెట్) అక్కడ కచోరీలు కొనుక్కొని తాపీగా రైలును స్టార్ట్ చేశాడు.. కచోరీల కోసం ఏకంగా రైలునే ఆపడం వైరల్‌గా మారింది.. చుట్టుపక్కల ఉన్నవారు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. రాజస్థాన్‌లోని అళ్వార్‌లో ఈ ఘటన జరిగింది. 


రాజస్థాన్‌లోని అళ్వార్‌లో ఓ రైల్వే క్రాసింగ్ దగ్గర ఓ వ్యక్తి కచోరీలు ఉన్న సంచి పట్టుకుని నిల్చున్నాడు. రైలు నెమ్మదిగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆగింది. లోకో పైలెట్ కచోరీలు తీసుకుని, డబ్బులు ఇచ్చిన తర్వాత కదిలింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. నిజానికి అలాంటి క్రాసింగ్‌ల దగ్గర రైలును ఆపడం నిషిద్ధం. దీంతో ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు అదేశించినట్టు సమాచారం. లోకో పైలట్‌, స్టేషన్ సూపరింటెండెంట్ సహా ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. 

Updated Date - 2022-02-22T22:53:47+05:30 IST