అడవి దున్నల దెబ్బకు తోక ముడిచిన సింహం.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-03-20T20:31:32+05:30 IST

అడవి దున్నల దెబ్బకు సింహం బెదిరిపోయింది. నోటి దాకా వచ్చిన ఆహారాన్ని వదిలేసింది. తోక ముడుచుకుని బిక్కుబిక్కుమంటూ మూలకు నక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా

అడవి దున్నల దెబ్బకు తోక ముడిచిన సింహం.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: అడవి దున్నల దెబ్బకు సింహం బెదిరిపోయింది. నోటి దాకా వచ్చిన ఆహారాన్ని వదిలేసింది. తోక ముడుచుకుని బిక్కుబిక్కుమంటూ మూలకు నక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆకలిగా ఉన్న ఓ ఆడ సింహం ఆహారం కోసం వేట ప్రారంభించింది. ఇంతలో ఓ అడవి దున్న దాని కంట పడింది. అది చూసి సింహం సంబరపడింది. తనకు తన పిల్లలకు మంచి ఆహారం దొరికిందని మురిసిపోయింది. అమాంతం వెళ్లి.. దానిపై పంజా విసిరింది. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న అడవి దున్నలు ఈ విషయాన్ని గమనించాయి. అంతే.. ఆ  సింహం వైపు దూసుకొచ్చాయి. దీంతో బెదిరిపోయిన సింహం.. ఆ అడవి దున్నను వదిలేసింది. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఫన్నీగా కమెంట్స్ చేస్తున్నారు.  


Updated Date - 2022-03-20T20:31:32+05:30 IST