Linguswami: తీవ్ర పరిణామాలుంటాయి

ABN , First Publish Date - 2022-11-20T19:12:32+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు స్ట్రెయిట్‌ చిత్రాలు మాత్రమే విడుదల చేయాలంటూ తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి చేసిన ప్రకటనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై ఇప్పటికే పలువురు కోలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఫైర్‌ అయ్యారు.

Linguswami: తీవ్ర పరిణామాలుంటాయి

తెలుగు రాష్ట్రాల్లో (TFI) సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు స్ట్రెయిట్‌  చిత్రాలు మాత్రమే విడుదల చేయాలంటూ తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి చేసిన ప్రకటనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై ఇప్పటికే పలువురు కోలీవుడ్‌ దర్శక నిర్మాతలు ఫైర్‌ అయ్యారు. తాజాగా లింగుస్వామి (Lingu swami)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ మాత్రం పద్థతిగా లేదని అన్నారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రకటించినట్లు జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన చెప్పారు.  (Lingu swami Fire on TFI)

‘‘తమిళ సినిమాకు ప్యాన్‌ ఇండియా అనేది కొత్తేమీ కాదు. ఈ ఇండస్ర్టీ నుంచి వచ్చిన ఎన్నో చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. ఓటీటీ రంగం అభివృద్థి చెందడంతో ఏ భాష వారైనా.. ఎక్కడి నుంచైనా సినిమాలు చూసే అవకాశం ఉంది.  తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం అమలు జరిగితే ‘వారిసు’కు ముందు.. తర్వాత అనేలా పరిస్థితులు మారతాయి. రెండు ఇండస్ట్రీల పెద్దలు కూర్చుని ఓ మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటిదే మరోసారి జరిగితే తర్వాత ఏం చేయాలో మాకూ తెలుసు’’ అని లింగుస్వామి ఫైర్‌ అయ్యారు. తమిళ హీరో విజయ్‌,  వంశీ పైడిపైల్లి కలయికలో ‘వారిసు’ చిత్రం తెరకెక్కుతున్న ఇషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరుతో సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ఇదే సమయంల నిర్మాతల మండలి చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. దీంతో ‘వారిసు’ విడుదల గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. 2019ల అగ్ర నిర్మాత దిల్‌ రాజు సంక్రాంతికి స్ట్రెయిట్‌ సినిమాల విడుదలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ ఆలోచనే ఆయన నిర్మించిన చిత్రం ‘వారిసు’ విడుదలు అడ్డుపడేలా ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న విడుదల కానున్న ‘తోడేలు’ చిత్రం ప్రమోషన్స్‌లో అల్లు అరవింద్‌ ఈ విషయంపై స్పందించారు. నిర్మాతల మండలి ప్రకటించిన నిర్ణయం ఏ మాత్రం ముందుకెళ్లదని, అది జరగని పని అని తేల్చి చెప్పారు. 


Updated Date - 2022-11-20T19:12:35+05:30 IST