పుట్టింటి నుంచి తీసుకొచ్చి మరీ భార్యను చంపేసిన భర్త.. కోర్టు అతనికి విధించిన శిక్షేంటంటే..

ABN , First Publish Date - 2022-02-26T19:32:26+05:30 IST

వారిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ముగ్గురు పిల్లలు ఉన్నారు.. అయినా ప్రతి చిన్న విషయానికీ గొడవపడుతుంటారు..

పుట్టింటి నుంచి తీసుకొచ్చి మరీ భార్యను చంపేసిన భర్త.. కోర్టు అతనికి విధించిన శిక్షేంటంటే..

వారిద్దరికీ ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది.. ముగ్గురు పిల్లలు ఉన్నారు.. అయినా ప్రతి చిన్న విషయానికీ గొడవపడుతుంటారు.. అలా గొడవపడినప్పుడల్లా ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంది.. అతను బతిమాలి తిరిగి తీసుకువెళ్తుంటాడు.. 2020 ఏప్రిల్‌లో కూడా ఆమె అలాగే పుట్టింటికి వెళ్లిపోయింది.. భర్త బతిమాలి ఇంటికి తిరిగి తీసుకెళ్లి ఆమెను గొంతు కోసి చంపేశాడు.. అనంతరం పోలీసులకు దొరికిపోయాడు. తాజాగా ఆ కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. 


ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు సమీపంలోని పెండ్ర గ్రామానికి చెందిన సీతారామ్ రాథోడ్ అనే వ్యక్తి 2014లో అనిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు. అయినా వీరు ప్రతి చిన్న విషయానికి గొడవపడుతుండేవారు. గొడవ తర్వాత అనిత పుట్టింటికి వెళ్లిపోతుండేది. కొన్ని రోజల తర్వాత సీతారామ్ ఆమెను బతిమాలి ఇంటికి తీసుకెళ్లేవాడు. 2020 ఏప్రిల్ 20వ తేదీన కూడా ఆమె అలాగే అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఏప్రిల్ 29వ తేదీన సీతారామ్ ఆమెను బతిమాలి ఇంటికి తీసుకెళ్లాడు. 


ఇంట్లో మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహం పట్టలేక కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. మృతదేహాన్ని బాత్రూమ్‌లో దాచి పెట్టాడు. అనిత బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీతారామ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై రెండేళ్లు విచారణ జరిపిన కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. సీతారామ్‌కు జీవిత ఖైదు విధించింది. 

Updated Date - 2022-02-26T19:32:26+05:30 IST