Viral Video: హెల్మెట్ ధరించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. రక్షణ కోసమే ఇలా చేశాడట.. వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-09-24T19:09:04+05:30 IST

సాధారణంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణికులు హెల్మెట్లు ధరిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ప్రమాదాలు చోటు చేసుకుంటే.. రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ద్విచక్ర వాహనాదారులకు పోలీసులు చెబుతారు. అయితే ఓ ఆర్టీసీ డ్రైవర్

Viral Video: హెల్మెట్ ధరించి బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్.. రక్షణ కోసమే ఇలా చేశాడట.. వైరల్ అవుతున్న వీడియో!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణికులు హెల్మెట్లు ధరిస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ప్రమాదాలు చోటు చేసుకుంటే.. రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ద్విచక్ర వాహనాదారులకు పోలీసులు చెబుతారు. అయితే ఓ ఆర్టీసీ డ్రైవర్(RTC Driver) మాత్రం హెల్మెట్(Helmet) ధరించి మరీ బస్సు నడుపుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా.. ఇంతకూ ఆ ఆర్టీసి డ్రైవర్ అలా హెల్మెట్ ధరించి బస్సు నడపడానికి కారణం ఏంటి? ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.


దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)‌కి సంబంధించిన నేతల కార్యాలయాలు, ఇళ్లపై ఎన్ఐఏ, ఈడీ వంటి సెంట్రల్ ఏజెన్సీలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 15 రాష్ట్రాల్లో సోదాలు జరిపి దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని పాంతాల్లో నిరసనలు చోటు చేసుకుంటున్నాయి. పీఎఫ్ఐ మద్దతు దారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కేరళలో కూడా ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనల సందర్భంగా రోడ్లైకి వస్తున్న పీఎఫ్ఐ మద్దతుదారులు.. రాళ్లదాడికి దిగుతున్నారు. దాడుల్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. 


దీంతో ఓ ఆర్టీసీ డ్రైవర్(Kerala RTC Driver) కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనను తాను రాళ్లదాడి నుంచి రక్షించుకోవడానికి హెల్మెట్ ధరించి మరీ విధులను నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొందరు ప్రయాణికులు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్‌(Viral)గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-09-24T19:09:04+05:30 IST