24,679 వజ్రాలు పొదిగిన ఉంగరం... భారత ఖ్యాతికి మరో గిన్నిస్ రికార్డు
ABN , First Publish Date - 2022-07-16T15:24:17+05:30 IST
కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఎస్‌డబ్ల్యుఏ డైమండ్స్...

కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఎస్‌డబ్ల్యుఏ డైమండ్స్ తాజాగా 24,679 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారుచేసింది. ఈ డైమండ్ రింగ్ పింక్ ఓస్టెర్ మష్రూమ్ ప్రేరణగా నిలిచింది. గతంలో 12,638 వజ్రాలు అమర్చిన రింగ్ రూపొందించారు. ఈ రికార్డును ఈ కొత్త రింగు బద్దలు కొట్టింది. ది టచ్ ఆఫ్ అమీని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) విద్యార్థి రిజిషా టివి రూపొందించారు.
90 రోజుల శ్రమతో ఈ అద్భుతమైన డైమండ్ రింగ్ తయారయ్యింది. రింగ్‌లోని అన్ని వజ్రాలు కేపీసీఎస్ సర్టిఫికేట్ పొందాయి. టచ్ ఆఫ్ అమీ ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుంది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్థానం సంపాదించుకుంది. వజ్రాల పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న భారత్ ఈ ఘనత సాధించడంపై తాము ఎంతో సంతోషిస్తున్నామని ఎస్ డబ్ల్యూఏ నిర్వాహకులు తెలిపారు.
