Shocking: ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు వీడియో కాల్.. తీవ్ర మనస్తపానికి గురైన భర్త ఎంత పని చేశాడంటే.. పిల్లలకు విషం తాగించి..
ABN , First Publish Date - 2022-08-20T00:49:35+05:30 IST
భార్య చేసిన పనికి ఏం చేయాలో తెలియక కర్ణాటక (Karnataka)కు చెందిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.

భార్య చేసిన పనికి ఏం చేయాలో తెలియక కర్ణాటక (Karnataka)కు చెందిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ప్రియుడితో పాటు వెళ్లిపోయిన భార్య ఎంతకీ తిరిగి రాకపోవడంతో తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్కి తరలిస్తుండగా అతడు చనిపోయాడు. పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. తుమకూరు(Tumukuru)లోని పీహెచ్ కాలనీకి చెందిన సమీయుల్లా అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇది కూడా చదవండి..
Killed With Kiss: ముద్దు పెట్టి చంపేసిన ప్రేయసి.. కనీవినీ ఎరుగని వింత కేసు..!
సమీయుల్లా భార్య సాహిరా బాను ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ప్రియుడితో కలిసి సౌదీ అరేబియా వెళ్లిపోయింది. అక్కడ ఒకరి ఇంట్లో పనిమనిషిగా చేరింది. ఉద్యోగం చేస్తూ ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ భర్తను, పిల్లలను మర్చిపోయింది. అంతేకాదు ప్రియుడితో రొమాన్స్ సాగిస్తూ భర్తకు వీడియో కాల్స్ చేస్తుండేది. సమీయుల్లా మాత్రం భార్యను తిరిగి వచ్చేయాలని వేడుకునేవాడు. తన కోసం కాకపోయినా కనీసం పిల్లల కోసం అయినా ఇంటికి రమ్మని బతిమలాడేవాడు. అయినా సహీరా మనసు కరగలేదు.
భార్య ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీయుల్లా తన ముగ్గురు పిల్లల చేత విషం తాగించాడు. అనంతరం తానూ కూడా విషం తాగేశాడు. బంధువులు గుర్తించి హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో సమీయుల్లా మృతి చెందాడు. ముగ్గురు పిల్లలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురి పరిస్థితి ప్రస్తుతానికి విషమంగానే ఉది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.