Viral Video: వీడియో చూసి ఆర్టీసీ సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాలంటున్న నెటిజన్లు.. ఇంతకూ అందులో ఏముందంటే..

ABN , First Publish Date - 2022-09-11T20:18:24+05:30 IST

ఓ కండక్టర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కండక్టర్, బస్సు డ్రైవర్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో.. ఆర్టీసీ

Viral Video: వీడియో చూసి ఆర్టీసీ సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాలంటున్న నెటిజన్లు.. ఇంతకూ అందులో ఏముందంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఓ కండక్టర్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కండక్టర్, బస్సు డ్రైవర్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో.. ఆర్టీసీ సిబ్బందిని ఎడ్యుకేట్ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకూ అలసు ఆ వైరల్ వీడియోలో ఏముంది? అనే పూర్తి వివరాల్లోకి వెళితే...




తాగుబోతు ప్రయాణికుడు రోడ్డుపై నిల్చుని అటుగా వెళ్తున్న బస్సును ఆపాడు. అనంతరం తూలుతూ బస్సెక్కాడు. ఇంతలో బస్సులోని కండక్టర్‌కు, అతడికి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బస్సు కండక్టర్ ఆ తాగుబోతు ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. వెనక్కి నెట్టేస్తూ అతడి ముఖంపై ఇష్టమొచ్చినట్టు కొట్టాడు. అంతటితో ఆగకుండా ఛాతిపై తన్ని.. బస్సు నుంచి నేలపై పడేశాడు. అనంతరం అక్కడ బస్సు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని పుత్తూరు తాలూక బస్‌స్టాప్ వద్ద చోటు చేసుకోగా.. అక్కడున్న స్థానికలు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు..‘ ఇటువంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి’ అని సూచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


Updated Date - 2022-09-11T20:18:24+05:30 IST